చెలికత్తె లిందరును సేసేరు విన్నపాలు
(॥పల్లవి॥)
చెలికత్తె లిందరును సేసేరు విన్నపాలు
నెలఁత చక్కఁదనాలు నీకే తగునయ్యా
(॥చెలి॥)
కప్పురము దిన్న నోర కలికి కతలు చెప్పీ
వొప్పుగాఁ జెవులార విని వూఁకొనవయ్యా
కుప్పెసవరముతోడ గొప్పగాఁ దురుమువెట్టె
చొప్పుగాఁ గనుఁగొనలఁ జూడవయ్యా
(॥చెలి॥)
కంకణాలు వెట్టుకొన్నకరముల నీకు మొక్కీ
తెంకి నుండి నీ వందుకు దీవించవయ్యా
కుంకుమ గుబ్బ లదర కొసరి నీతో నవ్వీ
లంకెలుగా నాపెకు వలవఁగదవయ్యా
(॥చెలి॥)
గందము వూసుకొనిన కాఁగిట నీతోఁ బెనఁగీ
చెంది నీ వందుకు సంతోసించువయ్యా
ఇందరిలో శ్రీవేంకటేశ నన్ను నేలితివి
చందమాయఁ గాఁపురము చనవియ్యవయ్యా
(||pallavi||)
sĕligattĕ liṁdarunu seseru vinnabālu
nĕlam̐ta sakkam̐danālu nīge tagunayyā
(||sĕli||)
kappuramu dinna nora kaligi kadalu sĕppī
vŏppugām̐ jĕvulāra vini vūm̐kŏnavayyā
kuppĕsavaramudoḍa gŏppagām̐ durumuvĕṭṭĕ
sŏppugām̐ ganum̐gŏnalam̐ jūḍavayyā
(||sĕli||)
kaṁkaṇālu vĕṭṭugŏnnagaramula nīgu mŏkkī
tĕṁki nuṁḍi nī vaṁdugu dīviṁchavayyā
kuṁkuma gubba ladara kŏsari nīdo navvī
laṁkĕlugā nābĕgu valavam̐gadavayyā
(||sĕli||)
gaṁdamu vūsugŏnina kām̐giḍa nīdom̐ bĕnam̐gī
sĕṁdi nī vaṁdugu saṁtosiṁchuvayyā
iṁdarilo śhrīveṁkaḍeśha nannu nelidivi
saṁdamāyam̐ gām̐puramu sanaviyyavayyā