చెలి యిప్పుడే బుద్దిచెప్పితిఁ జుమీ నీకు
(॥పల్లవి॥)
చెలి యిప్పుడే బుద్దిచెప్పితిఁ జుమీ నీకు
చెలరేఁగి చిత్తమురా సేవలెల్లాఁ జేయవే
(॥చెలి॥)
కంకణాలచేతులఁ గాఁగిలించి రమణుని
వుంకువగా మోవి యిచ్చి వూరడించేవు
మంకుదనాన నితని మాటల దూరవుగదా
లంకెలఁ బెనఁగి యింకా లాలించఁగదవే
(॥చెలి॥)
చిప్పిలుగుబ్బల నూఁది చెక్కునొక్కి యీతనికి
చెప్పరానిప్రియాలెల్లాఁ జేప్పేవు నీవు
అప్పటి వుబ్బున నీవేమైనాఁ జేయవుగదా
ముప్పిరిఁ బాదాల కింకా మొక్కనేనాఁ గదవే
(॥చెలి॥)
కొచ్చి మోముమోముతోడఁ గూడించి శ్రీవేంకటేశు-
నిచ్చకములెల్లాఁ జేసి యెనసితివి
అచ్చపురతులవేళ నలయించవుగదా
మచ్చికల బుజ్జగించి మరిగించఁగదవే
(||pallavi||)
sĕli yippuḍe buddisĕppidim̐ jumī nīgu
sĕlarem̐gi sittamurā sevalĕllām̐ jeyave
(||sĕli||)
kaṁkaṇālasedulam̐ gām̐giliṁchi ramaṇuni
vuṁkuvagā movi yichchi vūraḍiṁchevu
maṁkudanāna nidani māḍala dūravugadā
laṁkĕlam̐ bĕnam̐gi yiṁkā lāliṁcham̐gadave
(||sĕli||)
sippilugubbala nūm̐di sĕkkunŏkki yīdanigi
sĕpparānipriyālĕllām̐ jeppevu nīvu
appaḍi vubbuna nīvemainām̐ jeyavugadā
muppirim̐ bādāla kiṁkā mŏkkanenām̐ gadave
(||sĕli||)
kŏchchi momumomudoḍam̐ gūḍiṁchi śhrīveṁkaḍeśhu-
nichchagamulĕllām̐ jesi yĕnasidivi
achchaburadulaveḽa nalayiṁchavugadā
machchigala bujjagiṁchi marigiṁcham̐gadave