చెలి యన్నింటికి నీకుఁ జేతులెత్తి మొక్కీ నిదె
(॥పల్లవి॥)
చెలి యన్నింటికి నీకుఁ జేతులెత్తి మొక్కీ నిదె
లలి నీపెఁ గాఁగిలించి లాలించవయ్యా
(॥చెలి॥)
అలసి సొలసి నిన్ను నంగనలు జంకింతురు
వలపులు పైఁజల్లి వంచుకొందురు
గిలిగింతరతులను కెరలి పైకొందురు
వులివచ్చి సరసాల వోరుచుకోయ్యా
(॥చెలి॥)
కూరిమి గొసరి నిన్ను కొనగోర నూఁదుదురు
సారె సారెఁ బంతముతో సాదింతురు
దూరుదురు కేరుదురు తొడమీఁద నెక్కుదురు
వూరక వాడికబీరా లోరుచుకొవయ్యా
(॥చెలి॥)
కుమ్మెలుగాఁ గాఁగిలించి గుబ్బల నిన్నొత్తుదురు
కమ్ముకొని కెమ్మోని గంటిసేతురు
నెమ్మది శ్రీవేంకటేశ నీ వీకెఁ గూడితివి
వుమ్మగిలుఁ జేఁత లివి వోరుచుకోవయ్యా
(||pallavi||)
sĕli yanniṁṭigi nīgum̐ jedulĕtti mŏkkī nidĕ
lali nībĕm̐ gām̐giliṁchi lāliṁchavayyā
(||sĕli||)
alasi sŏlasi ninnu naṁganalu jaṁkiṁturu
valabulu paim̐jalli vaṁchugŏṁduru
giligiṁtaradulanu kĕrali paigŏṁduru
vulivachchi sarasāla vorusugoyyā
(||sĕli||)
kūrimi gŏsari ninnu kŏnagora nūm̐duduru
sārĕ sārĕm̐ baṁtamudo sādiṁturu
dūruduru keruduru tŏḍamīm̐da nĕkkuduru
vūraga vāḍigabīrā lorusugŏvayyā
(||sĕli||)
kummĕlugām̐ gām̐giliṁchi gubbala ninnŏttuduru
kammugŏni kĕmmoni gaṁṭiseduru
nĕmmadi śhrīveṁkaḍeśha nī vīgĕm̐ gūḍidivi
vummagilum̐ jem̐ta livi vorusugovayyā