Seli neegum daginadi seppavachchidimi nemu

చెలి నీకుఁ దగినది చెప్పవచ్చితిమి నేము
Language

(॥పల్లవి॥)
చెలి నీకుఁ దగినది చెప్పవచ్చితిమి నేము
పిలుచక రమ్మన్నది ప్రియము చేకోవయ్యా

(॥చెలి॥)
కలికిచేఁతలది కడుఁగడుఁజక్కనిది
తలఁపు నీపైఁ బెట్టి తగులైనది
మొలకచన్నులది సొమ్ములు నిండాఁ బెట్టినది
నెలకొని యాసలతో నీకు వలచినది

(॥చెలి॥)
చేరఁడేసి కన్నులది చిత్తరుబొమ్మవంటిది
కోరి నీగుణాలే యడుగుతామన్నది
మూరెఁడంత గొప్పుది ముసిముసినవ్వులది
వేరులేక నిన్నుఁ జూచేవేడుకతో నున్నది

(॥చెలి॥)
కొమరెవయసుది గుణాల నెక్కుడైనది
తమి నిన్ను వినివిని తనియనిది
జమళి శ్రీవేంకటేశ సతిఁ గూడితి వింతలొ
అమరి నీదేవులై యానందింపుచున్నది

(||pallavi||)
sĕli nīgum̐ daginadi sĕppavachchidimi nemu
pilusaga rammannadi priyamu segovayyā

(||sĕli||)
kaligisem̐taladi kaḍum̐gaḍum̐jakkanidi
talam̐pu nībaim̐ bĕṭṭi tagulainadi
mŏlagasannuladi sŏmmulu niṁḍām̐ bĕṭṭinadi
nĕlagŏni yāsalado nīgu valasinadi

(||sĕli||)
seram̐ḍesi kannuladi sittarubŏmmavaṁṭidi
kori nīguṇāle yaḍugudāmannadi
mūrĕm̐ḍaṁta gŏppudi musimusinavvuladi
verulega ninnum̐ jūseveḍugado nunnadi

(||sĕli||)
kŏmarĕvayasudi guṇāla nĕkkuḍainadi
tami ninnu vinivini taniyanidi
jamaḽi śhrīveṁkaḍeśha sadim̐ gūḍidi viṁtalŏ
amari nīdevulai yānaṁdiṁpusunnadi