Selavula navvanela siggulu vadamganela

సెలవుల నవ్వనేల సిగ్గులు వడఁగనేల
Language

(॥పల్లవి॥)
సెలవుల నవ్వనేల సిగ్గులు వడఁగనేల
సొలసీ నాపె మోము చూడఁగదవయా

(॥సెల॥)
కొత్త కొత్త విన్నపాలు కోమలి సేసీ నీకు
చిత్తగించి వినవయ్య చెవులారను
బత్తితోడ నీకు నిమ్మపండు గానుక యిచ్చీ
హత్తి వేడుకతోడుత నందుకోఁగదవయా

(॥సెల॥)
గొప్ప గొప్ప చన్నులను కోరి నిన్ను నొత్తీని
వొప్పు గొని మెచ్చవయ్యా వొద్దికతోను
ముప్పిరిగొనఁగ తేనె మోవివే విందులు వెట్టీ
దప్పిదేరఁ జవిగొని తనివి నొందవయా

(॥సెల॥)
మంచి మంచి విడే లిచ్చి మచ్చిక నీపైఁ జల్లీ
కొంచక కాఁగట నించి కూడవయ్యా
ముంచి శ్రీవేంకటేశుఁడ మునుపే న న్నేలితివి
పొంచి యాపె నీకు మొక్కీ బొందులు సేయవయా

(||pallavi||)
sĕlavula navvanela siggulu vaḍam̐ganela
sŏlasī nābĕ momu sūḍam̐gadavayā

(||sĕla||)
kŏtta kŏtta vinnabālu komali sesī nīgu
sittagiṁchi vinavayya sĕvulāranu
battidoḍa nīgu nimmabaṁḍu gānuga yichchī
hatti veḍugadoḍuda naṁdugom̐gadavayā

(||sĕla||)
gŏppa gŏppa sannulanu kori ninnu nŏttīni
vŏppu gŏni mĕchchavayyā vŏddigadonu
muppirigŏnam̐ga tenĕ movive viṁdulu vĕṭṭī
dappideram̐ javigŏni tanivi nŏṁdavayā

(||sĕla||)
maṁchi maṁchi viḍe lichchi machchiga nībaim̐ jallī
kŏṁchaga kām̐gaḍa niṁchi kūḍavayyā
muṁchi śhrīveṁkaḍeśhum̐ḍa munube na nnelidivi
pŏṁchi yābĕ nīgu mŏkkī bŏṁdulu seyavayā