సెలవిచ్చితి నీకు నీచేఁతలకెల్లా లోను
(॥పల్లవి॥)
సెలవిచ్చితి నీకు నీచేఁతలకెల్లా లోను
సెలవుల నవ్వుకొంటా సిగ్గుపడ కిపుడు
(॥సెల॥)
కోరి నీవెవ్వెతేఁ దెచ్చుకొనినా నే వలదన
యీరానియీవు లిచ్చినా నేమీ ననను
సారె నీకు నాపెకును సమతారుకాణలాయ
చేరి నా మొగము చూచి సిగ్గుపడ కిపుడు
(॥సెల॥)
మఱి నెవ్వతెతోనైనా మాటలాడు నోరార
గుఱిగాఁ దొడపైఁబెట్టుకొని లాలించు
మెఱసి నీ కాపె తొల్లె మేనవదినెగాఁబోలు
చిఱుఁజెమటలతోడ సిగ్గువడ కిపుడు
(॥సెల॥)
తలఁచుకో యింకా నీతరుణి నెవ్వతెనైనా
చలివాసి కూడిమాడి సరసమాడు
అలమేలుమంగపతివైన శ్రీవేంకటేశుఁడ
చెలంగి నన్నేలిగతివి సిగ్గువడ కిపుడు
(||pallavi||)
sĕlavichchidi nīgu nīsem̐talagĕllā lonu
sĕlavula navvugŏṁṭā siggubaḍa kibuḍu
(||sĕla||)
kori nīvĕvvĕdem̐ dĕchchugŏninā ne valadana
yīrāniyīvu lichchinā nemī nananu
sārĕ nīgu nābĕgunu samadārugāṇalāya
seri nā mŏgamu sūsi siggubaḍa kibuḍu
(||sĕla||)
maṟi nĕvvadĕdonainā māḍalāḍu norāra
guṟigām̐ dŏḍabaim̐bĕṭṭugŏni lāliṁchu
mĕṟasi nī kābĕ tŏllĕ menavadinĕgām̐bolu
siṟum̐jĕmaḍaladoḍa sigguvaḍa kibuḍu
(||sĕla||)
talam̐sugo yiṁkā nīdaruṇi nĕvvadĕnainā
salivāsi kūḍimāḍi sarasamāḍu
alamelumaṁgabadivaina śhrīveṁkaḍeśhum̐ḍa
sĕlaṁgi nanneligadivi sigguvaḍa kibuḍu