Selamgi peddarigamu sedumgaani

చెలఁగి పెద్దరికము సేతుఁగాని
Language

(॥పల్లవి॥)
చెలఁగి పెద్దరికము సేతుఁగాని
కలఁక రేఁచేదానఁగాను సుమ్మీ నిన్నును

(॥చెలఁ॥)
నాకే వలతునంటా నమ్మికెలే లిచ్చేవు
చేకొంటెఁ గానవచ్చీఁ జెప్పవలెనా
రేకలు దీయిమనేవు రీతిగా నీబుజముల
కాకుసేసేదాననుఁగానుసుమ్మీ నిన్నును

(॥చెలఁ॥)
పాయలేనుసుమ్మీయని బాసలేల సేసేవు
యీయెడనే కానవచ్చీ విదియేఁటికి
సేయరానిచేఁతలెల్లాఁ జేయుమని యేలనేవు
కాయ పండుసేసేదానఁగాను సుమ్మీనిన్నును

(॥చెలఁ॥)
యిచ్చకపువాఁడనంటా యేల నన్ను ముట్టేవు
యెచ్చరిక గానవచ్చె నెఱుఁగుదును
కొచ్చి శ్రీవేంకటేశుఁడ కూడి నన్నేలుమనేవు
గచ్చుల మీరేదానఁగానుసుమ్మీ నిన్నును

(||pallavi||)
sĕlam̐gi pĕddarigamu sedum̐gāni
kalam̐ka rem̐sedānam̐gānu summī ninnunu

(||sĕlam̐||)
nāge valadunaṁṭā nammigĕle lichchevu
segŏṁṭĕm̐ gānavachchīm̐ jĕppavalĕnā
regalu dīyimanevu rīdigā nībujamula
kāgusesedānanum̐gānusummī ninnunu

(||sĕlam̐||)
pāyalenusummīyani bāsalela sesevu
yīyĕḍane kānavachchī vidiyem̐ṭigi
seyarānisem̐talĕllām̐ jeyumani yelanevu
kāya paṁḍusesedānam̐gānu summīninnunu

(||sĕlam̐||)
yichchagabuvām̐ḍanaṁṭā yela nannu muṭṭevu
yĕchchariga gānavachchĕ nĕṟum̐gudunu
kŏchchi śhrīveṁkaḍeśhum̐ḍa kūḍi nannelumanevu
gachchula mīredānam̐gānusummī ninnunu