చెలఁగి కొలువులోన సిగ్గులు వడఁగవద్దా
(॥పల్లవి॥)
చెలఁగి కొలువులోన సిగ్గులు వడఁగవద్దా
బలువుఁడవైతేనే ప్రహ్లాదవరదా
(॥చెల॥)
వడియుఁ జెమటతోడ వంచినమోముతోడ
తొడమీఁదఁగూచున్న తొయ్యలితోడ
జడిసేనీవలపులు సంకి బేసికిఁజూచి
పడఁతులెల్లా నవ్వేరు ప్రహ్లాదవరదా
(॥చెల॥)
నిట్టూరుపులు మీర నిద్దుర గన్నులఁ దేర
గుట్టుతో విన్నాపె గోర గీర
గట్టిగా నీవాపెను కాఁగిలించి వదలక
పట్టుకుండఁగా నవ్వేరు ప్రహ్లాదవరదా
(॥చెల॥)
సింగపుమోము మెఱయ చిమ్ముఁజూపులుబెరయ
అంగన కాఁగిట నొయ్యన దొరయ
రంగుగ శ్రీవేంకటాద్రిరాయఁడనై మన్నించఁగా
పంగెనల నవ్వేరు ప్రహ్లాదవరదా
(||pallavi||)
sĕlam̐gi kŏluvulona siggulu vaḍam̐gavaddā
baluvum̐ḍavaidene prahlādavaradā
(||sĕla||)
vaḍiyum̐ jĕmaḍadoḍa vaṁchinamomudoḍa
tŏḍamīm̐dam̐gūsunna tŏyyalidoḍa
jaḍisenīvalabulu saṁki besigim̐jūsi
paḍam̐tulĕllā navveru prahlādavaradā
(||sĕla||)
niṭṭūrubulu mīra niddura gannulam̐ dera
guṭṭudo vinnābĕ gora gīra
gaṭṭigā nīvābĕnu kām̐giliṁchi vadalaga
paṭṭuguṁḍam̐gā navveru prahlādavaradā
(||sĕla||)
siṁgabumomu mĕṟaya simmum̐jūbulubĕraya
aṁgana kām̐giḍa nŏyyana dŏraya
raṁguga śhrīveṁkaḍādrirāyam̐ḍanai manniṁcham̐gā
paṁgĕnala navveru prahlādavaradā