Sekku nokki vemdugoni seduletti mokke neegu

చెక్కు నొక్కి వేఁడుకొని చేతులెత్తి మొక్కే నీకు
Language

(॥పల్లవి॥)
చెక్కు నొక్కి వేఁడుకొని చేతులెత్తి మొక్కే నీకు
నెక్కొన్న నీ సతి నేను నేరము లెంచే(చ?)కుమీ

(॥చెక్కు॥)
మనసు నొవ్వదుగదా మగువను జంకించితే
ఘనమోహ మాపెమీఁదఁ గలదు నీకు
కనుఁగొంటే సవతులు గరిసించక మానరు
పనివడి అవెల్లా నీపైఁ బెట్టుకోకుమీ

(॥చెక్కు॥)
సిగ్గులు పడవుగదా చెలి నేతువలెత్తితే
అగ్గలమై నీకెపుడు నాపె ప్రాణము
దగ్గరఁ గూచుంటే పడితలింతురు ఆఁడువారు
దిగ్గన నవెల్లా నీమీఁదికిఁ దీసుకోకుమీ

(॥చెక్కు॥)
సూడులు వట్టవుగదా సుదతి నే పంగించితే
యీడ శ్రీవేంకటేశ నీకీపె చుట్టము
కూడితవి నను నిట్టె పాడి యెంతురు కాంతలు
వేడుకలవెల్లా నీవు వేసరుకోకుమీ

(||pallavi||)
sĕkku nŏkki vem̐ḍugŏni sedulĕtti mŏkke nīgu
nĕkkŏnna nī sadi nenu neramu lĕṁche(sa?)kumī

(||sĕkku||)
manasu nŏvvadugadā maguvanu jaṁkiṁchide
ghanamoha mābĕmīm̐dam̐ galadu nīgu
kanum̐gŏṁṭe savadulu garisiṁchaga mānaru
panivaḍi avĕllā nībaim̐ bĕṭṭugogumī

(||sĕkku||)
siggulu paḍavugadā sĕli neduvalĕttide
aggalamai nīgĕbuḍu nābĕ prāṇamu
daggaram̐ gūsuṁṭe paḍidaliṁturu ām̐ḍuvāru
diggana navĕllā nīmīm̐digim̐ dīsugogumī

(||sĕkku||)
sūḍulu vaṭṭavugadā sudadi ne paṁgiṁchide
yīḍa śhrīveṁkaḍeśha nīgībĕ suṭṭamu
kūḍidavi nanu niṭṭĕ pāḍi yĕṁturu kāṁtalu
veḍugalavĕllā nīvu vesarugogumī