చెక్కిటిచే యికఁనేల చింతలేల
(॥పల్లవి॥)
చెక్కిటిచే యికఁనేల చింతలేల
అక్కరతో నాపె నీ యలపారిచీఁగాక
(॥॥)
జవ్వనపు సతి తోడి సరసము
చివ్వన నీ మేనెల్లా జెమరింపించె
పువ్వుల వంతాలు పొలయాటలూ
నవ్వినవ్వి నీమనసు నాము లెక్కింపించె
(॥॥)
చక్కెరబొమ్మ వంటి యీసతి పొందులు
చిక్కించి నీకు వలపు చిమ్మి రేఁగించె
నిక్కినిక్కి యాపెఁ జూచె నీవేడుకలు
చెక్కుల చెనకులయి సిగ్గువిడిపించె
(॥॥)
అలమేలుమంగతో నెయ్యపురతులు
నిలువెల్ల సింగారమై నీకునమరె
నెలవై శ్రీవేంకటేశ నీతమకము
అలరినచుట్టరికమై తగిలించె
(||pallavi||)
sĕkkiḍise yigam̐nela siṁtalela
akkarado nābĕ nī yalabārisīm̐gāga
(||||)
javvanabu sadi toḍi sarasamu
sivvana nī menĕllā jĕmariṁpiṁchĕ
puvvula vaṁtālu pŏlayāḍalū
navvinavvi nīmanasu nāmu lĕkkiṁpiṁchĕ
(||||)
sakkĕrabŏmma vaṁṭi yīsadi pŏṁdulu
sikkiṁchi nīgu valabu simmi rem̐giṁchĕ
nikkinikki yābĕm̐ jūsĕ nīveḍugalu
sĕkkula sĕnagulayi sigguviḍibiṁchĕ
(||||)
alamelumaṁgado nĕyyaburadulu
niluvĕlla siṁgāramai nīgunamarĕ
nĕlavai śhrīveṁkaḍeśha nīdamagamu
alarinasuṭṭarigamai tagiliṁchĕ