Seedaaraamula kalyaanam soosina vaaride vaibho

సీతారాముల కల్యాణం చూసిన వారిదే వైభో
Year
Language

పల్లవి:

సీతారాముల కల్యాణం.. చూసిన వారిదే వైభోగం
కల్యాణ రాముని రూపం.. కాంచిన వారిదే కైవల్యం
ఆదిలక్ష్మియే సీతమ్మా.. ఆది పురుషుడే రామయ్యా..
ఆది దంపతుల అభినవ పరిణయం.. అమోఘము.. అనుపమము..
సీతారాముల కల్యాణం.. చూసిన వారిదే వైభోగం

చరణం 1:

ఎర్రని దోసిట.. తెల్లని ముత్యాలు.. సీత తలబ్రాలకై తీసింది...
తీసిన ముత్యాలు.. దోసిలి రంగుతో.. ఇంపుగా కెంపులై తోచాయి
కెంపులనుకున్నవి రామయ్య మైచాయ సోకగ నీలమ్ములైనాయి

ఇన్ని రంగులు చూసి.. ఇంతి తెలబోయింది
ఇనకులుడు.. చిరునవ్వు నవ్వాడు!

pallavi:

sīdārāmula kalyāṇaṁ.. sūsina vāride vaibhogaṁ
kalyāṇa rāmuni rūbaṁ.. kāṁchina vāride kaivalyaṁ
ādilakṣhmiye sīdammā.. ādi puruṣhuḍe rāmayyā..
ādi daṁpadula abhinava pariṇayaṁ.. amoghamu.. anubamamu..
sīdārāmula kalyāṇaṁ.. sūsina vāride vaibhogaṁ

saraṇaṁ 1:

ĕrrani dosiḍa.. tĕllani mutyālu.. sīda talabrālagai tīsiṁdi...
tīsina mutyālu.. dosili raṁgudo.. iṁpugā kĕṁpulai tosāyi
kĕṁpulanugunnavi rāmayya maisāya sogaga nīlammulaināyi

inni raṁgulu sūsi.. iṁti tĕlaboyiṁdi
inaguluḍu.. sirunavvu navvāḍu!