Seduletti mokke nide seliyaro vibhunigi

చేతులెత్తి మొక్కే నిదె చెలియరో విభునికి
Language

(॥పల్లవి॥)
చేతులెత్తి మొక్కే నిదె చెలియరో విభునికి
నీతితోడ నన్నిట్టె మన్నించి యేలుమనవే

(॥చేతు॥)
ఆసపడ్డదాని నింత అలయించకు మనవే
సేసవెట్టి జాగునేల సేసె ననవే
రాసికెక్కె నావలపు రవ్వసేయకు మనవే
మూసిన ముత్తుమువంటి ముద్దురాలననవే

(॥చేతు॥)
సిగ్గుతోడ నున్న దానిఁ జెనకకు మనవే
యెగ్గులేనిచోట నేఁప నేఁటి కనవే
వొగ్గి విడె మియ్యఁగాను వొడివట్టకు మనవే
కగ్గులేని తన వూడిగపుదాన ననవే

(॥చేతు॥)
ననిచినదానితోడ నాలితనమే లనవే
తనకు నాకును పొందుతగు ననవే
యెనసె శ్రీవేంకటేశుఁ డియ్యకొంటి ననవే
మనసు నమ్మిన మేనమఱఁదల ననవే

(||pallavi||)
sedulĕtti mŏkke nidĕ sĕliyaro vibhunigi
nīdidoḍa nanniṭṭĕ manniṁchi yelumanave

(||sedu||)
āsabaḍḍadāni niṁta alayiṁchagu manave
sesavĕṭṭi jāgunela sesĕ nanave
rāsigĕkkĕ nāvalabu ravvaseyagu manave
mūsina muttumuvaṁṭi muddurālananave

(||sedu||)
siggudoḍa nunna dānim̐ jĕnagagu manave
yĕggulenisoḍa nem̐pa nem̐ṭi kanave
vŏggi viḍĕ miyyam̐gānu vŏḍivaṭṭagu manave
kagguleni tana vūḍigabudāna nanave

(||sedu||)
nanisinadānidoḍa nālidaname lanave
tanagu nāgunu pŏṁdudagu nanave
yĕnasĕ śhrīveṁkaḍeśhum̐ ḍiyyagŏṁṭi nanave
manasu nammina menamaṟam̐dala nanave