చేతులారాఁ జేతలేల చెల్లదిఁకను
(॥పల్లవి॥)
చేతులారాఁ జేతలేల చెల్లదిఁకను
నాతి యెవ్వతో తన్ను నవ్వుఁబాటుచేసెను
(॥చేతు॥)
మాటాడకుమనవే మాణిక్యాలు మోవి రాలీ -
నాఁటది యెవ్వతో తన్ను నంత చేసెను
నాఁటఁజూడకుమనవే నవ్వు ముత్యా లవె రాలి
గాఁటాన నెవ్వతో తన్నుఁగడు రట్టుచేసెను
(॥చేతు॥)
అడుచిడకుమనవే అంటినగందాలు రాలీ
పడఁతి యెవ్వతో తన్నుఁ బచ్చిచేసేను
కడు మొక్కమనవే కామునిఅమ్ములు రాలీ
చిడుముడి యెవ్వతో సేసవెట్టెఁ దనకు
(॥చేతు॥)
అంగ మంటకుమనవే అయపుఁగళలు రేఁగీ -
నంగన యెవ్వతో తన్ను నలవరచె
ఇంగితాన శ్రీవేంకటేశుఁ డిట్టె నన్నుఁ గూడె
సంగతాయ నితరాలు చాలించుమనవె
(||pallavi||)
sedulārām̐ jedalela sĕlladim̐kanu
nādi yĕvvado tannu navvum̐bāḍusesĕnu
(||sedu||)
māḍāḍagumanave māṇikyālu movi rālī -
nām̐ṭadi yĕvvado tannu naṁta sesĕnu
nām̐ṭam̐jūḍagumanave navvu mutyā lavĕ rāli
gām̐ṭāna nĕvvado tannum̐gaḍu raṭṭusesĕnu
(||sedu||)
aḍusiḍagumanave aṁṭinagaṁdālu rālī
paḍam̐ti yĕvvado tannum̐ bachchisesenu
kaḍu mŏkkamanave kāmuniammulu rālī
siḍumuḍi yĕvvado sesavĕṭṭĕm̐ danagu
(||sedu||)
aṁga maṁṭagumanave ayabum̐gaḽalu rem̐gī -
naṁgana yĕvvado tannu nalavarasĕ
iṁgidāna śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ nannum̐ gūḍĕ
saṁgadāya nidarālu sāliṁchumanavĕ