చేతికొద్దివాడ ఆఁడు చెలియరో నీకు
(॥పల్లవి॥)
చేతికొద్దివాడ ఆఁడు చెలియరో నీకు
రాతిరిఁబగలుఁ బొంది రాఁపు సేయరాదా
(॥చేతి॥)
అండనుండి సొలసేవు అంతలోనె అలసేవు
నిండుఁ దగవరియైన నీరమణుని
చండివెట్ట నోపుదువు సాదించనేరుతువు
బొండుమల్లె పాను పదె భోగించరాదా
(॥చేతి॥)
పంతములే మెరసేవు పలుమారు జరసేవు
మంతనాన నుండినట్టిమగవానిని
వంతులు వెదకుదువు వాసికిఁ బెనఁగుదువు
దొంతిబోనా లివిగో పొత్తుల నుండరాదా
(॥చేతి॥)
కప్పురము లిచ్చేవు కాఁగిటనే వుచ్చేవు
కప్పినయాసల శ్రీవేంకటేశ్వరుని
యిప్పుడు దా నిన్నుఁ గూడె యీతఁడిట్టెనన్నునేలె
చిప్పిలుఁగెమ్మోవి యిదె చేకొనఁగరాదా
(||pallavi||)
sedigŏddivāḍa ām̐ḍu sĕliyaro nīgu
rādirim̐bagalum̐ bŏṁdi rām̐pu seyarādā
(||sedi||)
aṁḍanuṁḍi sŏlasevu aṁtalonĕ alasevu
niṁḍum̐ dagavariyaina nīramaṇuni
saṁḍivĕṭṭa nobuduvu sādiṁchaneruduvu
bŏṁḍumallĕ pānu padĕ bhogiṁcharādā
(||sedi||)
paṁtamule mĕrasevu palumāru jarasevu
maṁtanāna nuṁḍinaṭṭimagavānini
vaṁtulu vĕdaguduvu vāsigim̐ bĕnam̐guduvu
dŏṁtibonā livigo pŏttula nuṁḍarādā
(||sedi||)
kappuramu lichchevu kām̐giḍane vuchchevu
kappinayāsala śhrīveṁkaḍeśhvaruni
yippuḍu dā ninnum̐ gūḍĕ yīdam̐ḍiṭṭĕnannunelĕ
sippilum̐gĕmmovi yidĕ segŏnam̐garādā