Se saamsavayyaa neegum jikkem gaanige

చే చాఁచవయ్యా నీకుఁ జిక్కెఁ గానికె
Language

(॥పల్లవి॥)
చే చాఁచవయ్యా నీకుఁ జిక్కెఁ గానికె
కాచిన పూచిన కలగంపలతో కానికె

(॥చేచాఁ॥)
చెనకినగోరొత్తులచే కానికె
మెనలచన్నులు నీకుమునుగానికె
చనవులనవ్వు దరిశనకానికె
కనుచూపులే మంచికప్పురపుఁగానికె

(॥చేచాఁ॥)
వలపుల మొక్కు దీపావళికానికె
కలయికమాటలు వుగాదికానికె
వెలలేని మోవిపండు విందుకానికె
కలికిసిగ్గులు మించుఁగప్పురకానికె

(॥చేచాఁ॥)
ననుపులకూటమి కట్నము కానికె
పొనుఁగుమోవిసోఁకులు బూమికానికె
యెనసితివి శ్రీవేంకటేశ నన్నును
పనిగొనేరతులు పైపై తొట్లెకానికె

(||pallavi||)
se sām̐savayyā nīgum̐ jikkĕm̐ gānigĕ
kāsina pūsina kalagaṁpalado kānigĕ

(||sesām̐||)
sĕnaginagorŏttulase kānigĕ
mĕnalasannulu nīgumunugānigĕ
sanavulanavvu dariśhanagānigĕ
kanusūbule maṁchigappurabum̐gānigĕ

(||sesām̐||)
valabula mŏkku dībāvaḽigānigĕ
kalayigamāḍalu vugādigānigĕ
vĕlaleni movibaṁḍu viṁdugānigĕ
kaligisiggulu miṁchum̐gappuragānigĕ

(||sesām̐||)
nanubulagūḍami kaṭnamu kānigĕ
pŏnum̐gumovisom̐kulu būmigānigĕ
yĕnasidivi śhrīveṁkaḍeśha nannunu
panigŏneradulu paibai tŏṭlĕgānigĕ