చే కొలఁది మగఁడవు చెల్లింతు వాకె గర్వము
(॥పల్లవి॥)
చే కొలఁది మగఁడవు చెల్లింతు వాకె గర్వము
దీకొని ఇంతలో నీవు తిట్టఁగనేమిటికి
(॥చేకొ॥)
ఇంతవడి నవ్వు నవ్వె నేకతాలు నీతో నాడె
ఇంతకంటె నేమిసేసు నీపె నీతోను
బంతిబోజనాలు సేసె పచ్చిదేర మాటలాడె
కొంత గాఁగిలీకుండితేఁ గొరతాయనా
(॥చేకొ॥)
కెఱలించె నీమోహము కేలెత్తి సన్నలుసేసె
మఱి యేమిటఁ గొదువ మగువకును
మెఱఇంచెఁ దనమేలు మించి నీపై బత్తి చూపె
తఱి మోనాననుండితే తక్కువాయనా
(॥చేకొ॥)
చలివాపె రతులను చన్నులంటఁ బెనఁగెను
వెలితేది యాపెకు శ్రీవేంకటేశుఎడ
అలమేలుమంగపతి వన్నిటా నన్నేలితివి
కలకి లోన నుండితేఁ గడమాయనా
(||pallavi||)
se kŏlam̐di magam̐ḍavu sĕlliṁtu vāgĕ garvamu
dīgŏni iṁtalo nīvu tiṭṭam̐ganemiḍigi
(||segŏ||)
iṁtavaḍi navvu navvĕ negadālu nīdo nāḍĕ
iṁtagaṁṭĕ nemisesu nībĕ nīdonu
baṁtibojanālu sesĕ pachchidera māḍalāḍĕ
kŏṁta gām̐gilīguṁḍidem̐ gŏradāyanā
(||segŏ||)
kĕṟaliṁchĕ nīmohamu kelĕtti sannalusesĕ
maṟi yemiḍam̐ gŏduva maguvagunu
mĕṟa̮iṁchĕm̐ danamelu miṁchi nībai batti sūbĕ
taṟi monānanuṁḍide takkuvāyanā
(||segŏ||)
salivābĕ radulanu sannulaṁṭam̐ bĕnam̐gĕnu
vĕlidedi yābĕgu śhrīveṁkaḍeśhuĕḍa
alamelumaṁgabadi vanniḍā nannelidivi
kalagi lona nuṁḍidem̐ gaḍamāyanā