Savi saara meṟamgavaa jaananamduvu

చవి చార మెఱఁగవా జాణనందువు
Language

(॥పల్లవి॥)
చవి చార మెఱఁగవా జాణనందువు
యివి యెల్ల నాపెకు నీవిచ్చిన చనవులే

(॥చవి॥)
చెప్పరాని మాటలకు చెవులొగ్గే వేమయ్య
వొప్పులెల్లా చెలినగవుల నున్నవి
కప్పురపునోఁటిమాఁట కమ్మి బరణిఁ బెట్టేవు
యెప్పు డాపె యేమనిన నేమాయ నీకు

(॥చవి॥)
సేయరాని చేఁతలకు సిగ్గవడే వేమయ్య
తోయరాదు అంగనచేతుల నున్నవి
పాయపుఁగళలకును బారలు చాఁచేవు నీవు
యీయెడ నేమిసేసిన నేమాయ నీకు

(॥చవి॥)
పట్టరాని వయసులు పచ్చిసేసే వేమయ్యా
నెట్టనఁ గాఁగిట నింతి నిన్నుఁ గూడెను
ముట్టితే శ్రీవేంకటేశ మోవితేనెఁ గొలిచేవు
యిట్టివి; మీసరసాల కేమాయ నీకు

(||pallavi||)
savi sāra mĕṟam̐gavā jāṇanaṁduvu
yivi yĕlla nābĕgu nīvichchina sanavule

(||savi||)
sĕpparāni māḍalagu sĕvulŏgge vemayya
vŏppulĕllā sĕlinagavula nunnavi
kappurabunom̐ṭimām̐ṭa kammi baraṇim̐ bĕṭṭevu
yĕppu ḍābĕ yemanina nemāya nīgu

(||savi||)
seyarāni sem̐talagu siggavaḍe vemayya
toyarādu aṁganasedula nunnavi
pāyabum̐gaḽalagunu bāralu sām̐sevu nīvu
yīyĕḍa nemisesina nemāya nīgu

(||savi||)
paṭṭarāni vayasulu pachchisese vemayyā
nĕṭṭanam̐ gām̐giḍa niṁti ninnum̐ gūḍĕnu
muṭṭide śhrīveṁkaḍeśha movidenĕm̐ gŏlisevu
yiṭṭivi; mīsarasāla kemāya nīgu