Savadula mimdaramu samgadinumte nemaaya

సవతుల మిందరము సంగడినుంటే నేమాయ
Language

(॥పల్లవి॥)
సవతుల మిందరము సంగడినుంటే నేమాయ
యివల నీ వెట్టుండినా యెవ్వ రేమనేరే

(॥॥)
ఆతనిమోము చూచేవు అంతలోన భ్రమసేవు
చేతిమీఁది చెక్కుతోడ చెమరించేవే
కాతర మింతగలితే కడుసిగ్గువడనేల
యేతులఁ గాఁగి లించితే నెవ్వ రేమనేరే

(॥॥)
పై కొని మాటలాడేవు భావములో నలసేవు
దాకొన్నయాసలతోడ తడఁబడేవు
నీకింతఁయాకటయైతే నివ్వెరగు లిపుడేల
యీకడ నెంతసేసినా యెవ్వ రేమనేరే

(॥॥)
అడియాలములు చూపేవు ఆయములు సోఁకించేవు
తడవి శ్రీ వేంకటేశుదండ వాయవు
బడి నాతఁడు నన్నేలె పచ్చిగా నవ్వునేల
యెడయక నీవెంతన్నా యెవ్వ రేమనేరే

(||pallavi||)
savadula miṁdaramu saṁgaḍinuṁṭe nemāya
yivala nī vĕṭṭuṁḍinā yĕvva remanere

(||||)
ādanimomu sūsevu aṁtalona bhramasevu
sedimīm̐di sĕkkudoḍa sĕmariṁcheve
kādara miṁtagalide kaḍusigguvaḍanela
yedulam̐ gām̐gi liṁchide nĕvva remanere

(||||)
pai kŏni māḍalāḍevu bhāvamulo nalasevu
dāgŏnnayāsaladoḍa taḍam̐baḍevu
nīgiṁtam̐yāgaḍayaide nivvĕragu libuḍela
yīgaḍa nĕṁtasesinā yĕvva remanere

(||||)
aḍiyālamulu sūbevu āyamulu som̐kiṁchevu
taḍavi śhrī veṁkaḍeśhudaṁḍa vāyavu
baḍi nādam̐ḍu nannelĕ pachchigā navvunela
yĕḍayaga nīvĕṁtannā yĕvva remanere