Savadivi nee vinnidaa jaanavaidivi

సవతివి నీ విన్నిటా జాణవైతివి
Language

(॥పల్లవి॥)
సవతివి నీ విన్నిటా జాణవైతివి
వువిదరో యింటిలోన నుండె తనిసితిమే

(॥సవ॥)
చనవరివౌదువే సంగడిఁగూచుందానవు
ననిచెనే మీ పొందులు నవ్వే రిద్దరు
యెనసి మేమైతేను యింతేసి నేరమైతిమే
మొనసి పెండ్లాడినందె మొగిఁ దనిసితిమే

(॥సవ॥)
పొందైనదాన వౌదువే పూనుక వచ్చేవు నీవు
ముందే చుట్టాలవుదరే మొక్కలాడేరు
పందేలు వేసి నీవలె బయలీఁదించ మైతిమే
కందువఁ గంకములు గట్టి తనిసితిమె

(॥సవ॥)
బత్తిగలదానవె పైపై సేవలు సేసేవు
పొత్తు మీకుఁ గలసునే బువ్వా లందేరు
యిత్తల శ్రీవేంకటేశుఁ డిటు నన్ను నేలినాఁడు
హత్తి సేసలువెట్టినయందె తనిసితిమే

(||pallavi||)
savadivi nī vinniḍā jāṇavaidivi
vuvidaro yiṁṭilona nuṁḍĕ tanisidime

(||sava||)
sanavarivauduve saṁgaḍim̐gūsuṁdānavu
nanisĕne mī pŏṁdulu navve riddaru
yĕnasi memaidenu yiṁtesi neramaidime
mŏnasi pĕṁḍlāḍinaṁdĕ mŏgim̐ danisidime

(||sava||)
pŏṁdainadāna vauduve pūnuga vachchevu nīvu
muṁde suṭṭālavudare mŏkkalāḍeru
paṁdelu vesi nīvalĕ bayalīm̐diṁcha maidime
kaṁduvam̐ gaṁkamulu gaṭṭi tanisidimĕ

(||sava||)
battigaladānavĕ paibai sevalu sesevu
pŏttu mīgum̐ galasune buvvā laṁderu
yittala śhrīveṁkaḍeśhum̐ ḍiḍu nannu nelinām̐ḍu
hatti sesaluvĕṭṭinayaṁdĕ tanisidime