Savadibai machcharaana saadimchaguve yaadini

సవతిపై మచ్చరాన సాదించకువే యాతిని
Language

(॥పల్లవి॥)
సవతిపై మచ్చరాన సాదించకువే యాతిని
కవగూడీ నీమీఁద కడు బత్తిగలఁడు

(॥సవ॥)
ఆనలు వెట్టకువే ఆతఁడు వేఁడుకోఁగాను
మానవే నీ చలపాది మంకుఁదనాలు
వీనులు మూసుకోకువే వెస నొడఁబరచఁగా
కానిమ్మని యియ్యకోవే కాఁగిలించీ నిన్నును

(॥సవ॥)
బొమ్మల జంకించకువే పొంచి నీకొంగు వట్టఁగా
కమ్మటిఁ జూపకువే నీ గబ్బితనాలు
చిమ్మకువే కొనగోళ్ళచేత నిన్ను నంటఁగాను
సమ్మతించి యందుకోవే చక్కవిడె మిచ్చీని

(॥సవ॥)
పట్టి పెనఁకువే పైకొని లాలించఁగాను
చుట్టమవై యిఐకనేలే జూటుదనాలు
ఇట్టె శ్రీవేంకటేశుఁ డిన్నిటాను నిన్నుఁ గూడె
నెట్టుకొని పెట్టుకోవే నీకిచ్చిన సొమ్ములు

(||pallavi||)
savadibai machcharāna sādiṁchaguve yādini
kavagūḍī nīmīm̐da kaḍu battigalam̐ḍu

(||sava||)
ānalu vĕṭṭaguve ādam̐ḍu vem̐ḍugom̐gānu
mānave nī salabādi maṁkum̐danālu
vīnulu mūsugoguve vĕsa nŏḍam̐barasam̐gā
kānimmani yiyyagove kām̐giliṁchī ninnunu

(||sava||)
bŏmmala jaṁkiṁchaguve pŏṁchi nīgŏṁgu vaṭṭam̐gā
kammaḍim̐ jūbaguve nī gabbidanālu
simmaguve kŏnagoḽḽaseda ninnu naṁṭam̐gānu
sammadiṁchi yaṁdugove sakkaviḍĕ michchīni

(||sava||)
paṭṭi pĕnam̐kuve paigŏni lāliṁcham̐gānu
suṭṭamavai yiaiganele jūḍudanālu
iṭṭĕ śhrīveṁkaḍeśhum̐ ḍinniḍānu ninnum̐ gūḍĕ
nĕṭṭugŏni pĕṭṭugove nīgichchina sŏmmulu