సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో
పల్లవి:
సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో
చెప్పేది ఎవరు ఈ కంటికైనా
రెప్పల దుప్పటి కప్పే చీకటి
చూపించేనా ఏ కాంతినైనా
నిను నీవే సరిగ్గా కనలేవే మనసా
నడిరాతిరి నడకా కడతేరదు తెలుసా
ఏవో జ్ఞాపకాల సుడి దాటి బయటపడలేవా
ఎన్నో తీపి సంగతుల రేపు పిలుపు వినలేవా
చరణం 1:
చంద్రుడి ఎదలో మంటని వెన్నెల అనుకుంటారని
నిజమైనా నమ్మేస్తమా భ్రమలో పడమా తెలిసి
జాబిలిని వేలివేస్తమా తనతో చెలిమిని విడిచి
రూపం లేదు గనక సాక్ష్యాలు అడిగి ఎవరైనా
ప్రాణం ఉనికి పైన అనుమాన పడరు ఎపుడైనా
నిను నీవే సరిగ్గా కనలేవే మనసా
నడిరాతిరి నడకా కడతేరదు తెలుసా
చరణం 2:
పోయింది వెతికే వేదనా ఉండుంది ఏదో పోల్చునా
సంద్రంలో ఎగిసే ఆలకి అలజడి నిలిచేదెప్పుడో
సందేహం కలిగే మదికి కలతని తీర్చేదేవరో
శాపంలాగ వెంట పడుతున్న గతం ఏదైనా
దీపం లాగ తగిన దారేదో చూపగలిగేనా
pallavi:
satyaṁ emiḍo svapnaṁ emiḍo
sĕppedi ĕvaru ī kaṁṭigainā
rĕppala duppaḍi kappe sīgaḍi
sūbiṁchenā e kāṁtinainā
ninu nīve sariggā kanaleve manasā
naḍirādiri naḍagā kaḍaderadu tĕlusā
evo jñābagāla suḍi dāḍi bayaḍabaḍalevā
ĕnno tībi saṁgadula rebu pilubu vinalevā
saraṇaṁ 1:
saṁdruḍi ĕdalo maṁṭani vĕnnĕla anuguṁṭārani
nijamainā nammestamā bhramalo paḍamā tĕlisi
jābilini velivestamā tanado sĕlimini viḍisi
rūbaṁ ledu ganaga sākṣhyālu aḍigi ĕvarainā
prāṇaṁ unigi paina anumāna paḍaru ĕbuḍainā
ninu nīve sariggā kanaleve manasā
naḍirādiri naḍagā kaḍaderadu tĕlusā
saraṇaṁ 2:
poyiṁdi vĕdige vedanā uṁḍuṁdi edo polsunā
saṁdraṁlo ĕgise ālagi alajaḍi nilisedĕppuḍo
saṁdehaṁ kalige madigi kaladani tīrsedevaro
śhābaṁlāga vĕṁṭa paḍudunna gadaṁ edainā
dībaṁ lāga tagina dāredo sūbagaligenā