సరివయసు లిద్దరికి సతములై వొనగూడె
(॥పల్లవి॥)
సరివయసు లిద్దరికి సతములై వొనగూడె
యెరవులిఁకఁ బచరించనేఁటికే చెలియ
(॥సరి॥)
వెన్నవంటిది మనసు వెడకాఁకలకే కరఁగు
వెన్నెలవంటిది నవ్వు వేడుకొదవు
తన్నుదా నేఱఁగునీవు తతిగొన్నతమకములు
యన్నిలాగులఁ జలములేఁటికే చెలియా
(॥సరి॥)
విందువంటిది వలపు వింతలై చవిచూపు
మందువంటిదిచూపు మరిగించును
అంది పాయఁగనీవు అడియాసకోరికలు
ఇందులకుఁ బొలయలుకలేఁటికే చెలియా
(॥సరి॥)
(జి)చిగురువంటిది వావి చిక్కించి పెనఁగించు
(జి)చిగురువంటిది చెలిమి చెంగలించు
జిగిమించి నిన్నుఁ గూడె శ్రీ వేంకటేశ్వరుడు
యెగసక్కెముల సొలపులేటికా చెలియా
(||pallavi||)
sarivayasu liddarigi sadamulai vŏnagūḍĕ
yĕravulim̐kam̐ basariṁchanem̐ṭige sĕliya
(||sari||)
vĕnnavaṁṭidi manasu vĕḍagām̐kalage karam̐gu
vĕnnĕlavaṁṭidi navvu veḍugŏdavu
tannudā neṟam̐gunīvu tadigŏnnadamagamulu
yannilāgulam̐ jalamulem̐ṭige sĕliyā
(||sari||)
viṁduvaṁṭidi valabu viṁtalai savisūbu
maṁduvaṁṭidisūbu marigiṁchunu
aṁdi pāyam̐ganīvu aḍiyāsagorigalu
iṁdulagum̐ bŏlayalugalem̐ṭige sĕliyā
(||sari||)
(ji)siguruvaṁṭidi vāvi sikkiṁchi pĕnam̐giṁchu
(ji)siguruvaṁṭidi sĕlimi sĕṁgaliṁchu
jigimiṁchi ninnum̐ gūḍĕ śhrī veṁkaḍeśhvaruḍu
yĕgasakkĕmula sŏlabuleḍigā sĕliyā