సరికి బేసికి మీరె జాణలైతిరి
(॥పల్లవి॥)
సరికి బేసికి మీరె జాణలైతిరి
తిరమాయ వలపులు దిష్టముగా నిపుడు
(॥సరి॥)
కలువల నాకె వేసె కాలు దొక్కితివి నీవు
యెలమి సాకిరులు నేమేము చెప్పేము
కలికి గుట్టు తోడిది గద్దరికాఁడవు నీవు
వలసినట్టు సేసితే వద్దనేవా రెవ్వరు
(॥సరి॥)
కొద్ది మీరి నవ్వె నాపె కొంగువట్టితివి నీవు
యిద్దరికి దగవు నే మెట్టు చెప్పేము
పెద్దరికపు సకియ ప్రియమువాఁడవు నీవు
తిద్దుకొని మీకు మీకే తేరుదురుగాక
(॥సరి॥)
గక్కనఁ గొసరె నాపె కాఁగిలించితివి నీవు
యెక్కువ తక్కువలు నే మేమి చెప్పేము
యిక్కడ నీ దేవులని యేలితివి శ్రీవేంకటేశ
చక్కనాయఁ బనులెల్లా సాదించ నేమిటికి
(||pallavi||)
sarigi besigi mīrĕ jāṇalaidiri
tiramāya valabulu diṣhṭamugā nibuḍu
(||sari||)
kaluvala nāgĕ vesĕ kālu dŏkkidivi nīvu
yĕlami sāgirulu nememu sĕppemu
kaligi guṭṭu toḍidi gaddarigām̐ḍavu nīvu
valasinaṭṭu seside vaddanevā rĕvvaru
(||sari||)
kŏddi mīri navvĕ nābĕ kŏṁguvaṭṭidivi nīvu
yiddarigi dagavu ne mĕṭṭu sĕppemu
pĕddarigabu sagiya priyamuvām̐ḍavu nīvu
tiddugŏni mīgu mīge terudurugāga
(||sari||)
gakkanam̐ gŏsarĕ nābĕ kām̐giliṁchidivi nīvu
yĕkkuva takkuvalu ne memi sĕppemu
yikkaḍa nī devulani yelidivi śhrīveṁkaḍeśha
sakkanāyam̐ banulĕllā sādiṁcha nemiḍigi