సరిబేసు లవి యివి సరిసరియే
(॥పల్లవి॥)
సరిబేసు లవి యివి సరిసరియే
తరుణి చెలువములు దైవారినట్లు
(॥సరి॥)
కాంతకాటుకలకనుచూపులకును
శాంతపు నవ్వులు సరిసరియే
వింతగఁ గస్తూరివీణెలలోపల
కాంతులఁ గప్పురము గలసినయట్లు
(॥సరి॥)
ముదిత చింద్రికమోవికిఁ దెల్లని -
చదురుదంతములు సరిసరియే
కదిపిన సంధ్యాకాలములోపల
వుదయ చంద్రరుచి వొలికినయట్లు
(॥సరి॥)
చెలికుచములకు శ్రీవేంకటపతి -
చలువకాఁగి లిది సరిసరియే
మెలుపగుఁగొండలమీఁదట నల్లని -
బలుపగుమేఘము పైకొన్నట్లు
(||pallavi||)
saribesu lavi yivi sarisariye
taruṇi sĕluvamulu daivārinaṭlu
(||sari||)
kāṁtagāḍugalaganusūbulagunu
śhāṁtabu navvulu sarisariye
viṁtagam̐ gastūrivīṇĕlalobala
kāṁtulam̐ gappuramu galasinayaṭlu
(||sari||)
mudida siṁdrigamovigim̐ dĕllani -
sadurudaṁtamulu sarisariye
kadibina saṁdhyāgālamulobala
vudaya saṁdrarusi vŏliginayaṭlu
(||sari||)
sĕligusamulagu śhrīveṁkaḍabadi -
saluvagām̐gi lidi sarisariye
mĕlubagum̐gŏṁḍalamīm̐daḍa nallani -
balubagumeghamu paigŏnnaṭlu