Saranagimkinulu ghallu ghallumana

చరణకింకిణులు ఘల్లు ఘల్లుమన
Year
Language

పల్లవి:

చరణకింకిణులు ఘల్లు ఘల్లుమన..
కరకంకణములు గల గలలాడగ..
హ..హ..హ

అడుగులందు కలహంసలాడగా
నడుములో తరంగమ్ములూగగా
వినీల కచభర.. విలాస బంధుర..
తనూలతిక చంచలించిపోగా...

ఆడవే మయూరీ...నటనమాడవే మయూరీ..
నీ కులుకును గని నా పలుకు విరియ..
నీ నటనను గని నవకవిత వెలయగా.. !!
ఆడవే మయూరీ...నటనమాడవే మయూరీ..
... ఆడవే మయూరీ !!

చరణం 1:

అది యమునా సుందర తీరమూ... అది రమణీయ బృందావనమూ..
అది విరిసిన పున్నమి వెన్నెలా... అది వీచిన తెమ్మెర ఊయలా..
అది చల్లని సైకత వేదికా.. ఆట సాగెను విరహిణి రాధికా..
అది రాధ మనసులో మాధవుడూదిన రసమయ మురళీ గీతికా..

ఆడవే మయూరీ.. నటనమాడవే మయూరీ..
నా పలుకులకెనయగు కులుకు చూపి..
నా కవితకు సరి యగు నటన చూపి
ఇక ఆడవే మయూరీ... నటనమాడవే మయూరీ

చరణం 2:

పాలనేత్ర సంప్రదవజ్వాలలు ప్రసవశరుని దహియించగా..
పతిని కోలుపడి రతీదేవి దుఃఖిత మతియై రోదించగా..
హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమధ గణము కనిపించగా..
ప్రమధనాధ కర పంకజ భాంకృత ఢమరు ధ్వని వినిపించగా..
ప్రళయకాల సంకలిత భయంకర జలధరార్భుటుల చలిత
దిక్కుటుల జటిత దిక్కురుల వికృత ఘీంకృతుల సహస్ర ఫణ సంచలిత భూకృతుల..

కనులలోన.. కనుబొమలలోన... అధరమ్ములోన..వదనమ్ములోన..
కనులలోన.. కనుబొమలలోన... అధరమ్ములోన..వదనమ్ములోన..

గళసీమలోన.. కటిసీమలోనా.. కరయుగములోన..పదయుగములోన...
నీ తనువులోని అణువణువులోన ..అనంత విధముల అభినయించి ఇక ఆడవే....ఆడవే..ఆడవే...

pallavi:

saraṇagiṁkiṇulu ghallu ghallumana..
karagaṁkaṇamulu gala galalāḍaga..
ha..ha..ha

aḍugulaṁdu kalahaṁsalāḍagā
naḍumulo taraṁgammulūgagā
vinīla kasabhara.. vilāsa baṁdhura..
tanūladiga saṁchaliṁchibogā...

āḍave mayūrī...naḍanamāḍave mayūrī..
nī kulugunu gani nā palugu viriya..
nī naḍananu gani navagavida vĕlayagā.. !!
āḍave mayūrī...naḍanamāḍave mayūrī..
... āḍave mayūrī !!

saraṇaṁ 1:

adi yamunā suṁdara tīramū... adi ramaṇīya bṛṁdāvanamū..
adi virisina punnami vĕnnĕlā... adi vīsina tĕmmĕra ūyalā..
adi sallani saigada vedigā.. āḍa sāgĕnu virahiṇi rādhigā..
adi rādha manasulo mādhavuḍūdina rasamaya muraḽī gīdigā..

āḍave mayūrī.. naḍanamāḍave mayūrī..
nā palugulagĕnayagu kulugu sūbi..
nā kavidagu sari yagu naḍana sūbi
iga āḍave mayūrī... naḍanamāḍave mayūrī

saraṇaṁ 2:

pālanetra saṁpradavajvālalu prasavaśharuni dahiyiṁchagā..
padini kolubaḍi radīdevi duḥkhida madiyai rodiṁchagā..
himagirīṁdra śhikharāgra tāṁḍavat pramadha gaṇamu kanibiṁchagā..
pramadhanādha kara paṁkaja bhāṁkṛta ḍhamaru dhvani vinibiṁchagā..
praḽayagāla saṁkalida bhayaṁkara jaladharārbhuḍula salida
dikkuḍula jaḍida dikkurula vikṛta ghīṁkṛtula sahasra phaṇa saṁchalida bhūkṛtula..

kanulalona.. kanubŏmalalona... adharammulona..vadanammulona..
kanulalona.. kanubŏmalalona... adharammulona..vadanammulona..

gaḽasīmalona.. kaḍisīmalonā.. karayugamulona..padayugamulona...
nī tanuvuloni aṇuvaṇuvulona ..anaṁta vidhamula abhinayiṁchi iga āḍave....āḍave..āḍave...