చనవు చెల్లించ నేర్చే సరసుఁడవు
(॥పల్లవి॥)
చనవు చెల్లించ నేర్చే సరసుఁడవు
నిను ముదు లడుగక నీ ఇల్లు చేకొంటిని
(॥చన॥)
ఆసతోడ నిన్ను నేను అంటిముట్టి పెనఁగుదు
వాసివంతు లెంచను నే వనిత నైనా
సేసవెట్టిన సలిగె చిత్తమునఁ బట్టుకొని
నీ సిరులకెల్లాను నేనే కర్తనైతిని
(॥చన॥)
సంతోసాన నీతోను సారె సారె నవ్వుదును
వింత సేసుకొనను నే వెలఁది నైనా
పొంతఁ జేయివట్టినదే భోగ్యము సేసుకొని
రంతుల నేనే నీరాజ్యమెల్లా నేలితి
(॥చన॥)
గక్కన శ్రీ వేంకటేశ కాఁగిలించి కూడితిని
తక్కరి తనము సేయఁ దరుణినైనా
దక్కి నాపాల నున్నదే దరిదాపు సేసుకొని
వొక్క మనసున నీకు వొద్దికై నేనుంటిని
(||pallavi||)
sanavu sĕlliṁcha nerse sarasum̐ḍavu
ninu mudu laḍugaga nī illu segŏṁṭini
(||sana||)
āsadoḍa ninnu nenu aṁṭimuṭṭi pĕnam̐gudu
vāsivaṁtu lĕṁchanu ne vanida nainā
sesavĕṭṭina saligĕ sittamunam̐ baṭṭugŏni
nī sirulagĕllānu nene kardanaidini
(||sana||)
saṁtosāna nīdonu sārĕ sārĕ navvudunu
viṁta sesugŏnanu ne vĕlam̐di nainā
pŏṁtam̐ jeyivaṭṭinade bhogyamu sesugŏni
raṁtula nene nīrājyamĕllā nelidi
(||sana||)
gakkana śhrī veṁkaḍeśha kām̐giliṁchi kūḍidini
takkari tanamu seyam̐ daruṇinainā
dakki nābāla nunnade daridābu sesugŏni
vŏkka manasuna nīgu vŏddigai nenuṁṭini