సంగడి నట్టే వుంటే చవివుట్టీనా
(॥పల్లవి॥)
సంగడి నట్టే వుంటే చవివుట్టీనా
కొంగు వట్టి తియ్యఁగాను కోపించరాదా
(॥సంగ॥)
పయ్యెద నేఁబెట్టుకొంటే బలిమి నేనే వదేర
అయ్యో ఆఁటదాననై తే అలఁత తేదా
పొయ్యేనంటా లేచితేను పొదిగేవు నీ వదేర
కయ్య మడిచిన వేళ కడనుండరాదా
(॥సంగ॥)
ఆకడి మోము నే నైతే నలమి పట్టే వదేర
వాక నిష్టూరాలనైన వద్దనరాదా
చేకొని నే నుస్సురంటే చెక్కనొక్కే వదేర
కాఁక బొందినట్టివేళ కసరుకోరాదా
(॥సంగ॥)
కన్నుల నేఁ జూడకుంటే కాఁగిలించేఁ వదేర
సొన్నలనీచేఁతులకు చొక్కఁగరాదా
యెన్నఁగ శ్రీవేంకటేశ యింతసేసి కూడితివి
ఇన్నేసి నీ వినయాల కియ్యకొనరాదా
(||pallavi||)
saṁgaḍi naṭṭe vuṁṭe savivuṭṭīnā
kŏṁgu vaṭṭi tiyyam̐gānu kobiṁcharādā
(||saṁga||)
payyĕda nem̐bĕṭṭugŏṁṭe balimi nene vadera
ayyo ām̐ṭadānanai te alam̐ta tedā
pŏyyenaṁṭā lesidenu pŏdigevu nī vadera
kayya maḍisina veḽa kaḍanuṁḍarādā
(||saṁga||)
āgaḍi momu ne naide nalami paṭṭe vadera
vāga niṣhṭūrālanaina vaddanarādā
segŏni ne nussuraṁṭe sĕkkanŏkke vadera
kām̐ka bŏṁdinaṭṭiveḽa kasarugorādā
(||saṁga||)
kannula nem̐ jūḍaguṁṭe kām̐giliṁchem̐ vadera
sŏnnalanīsem̐tulagu sŏkkam̐garādā
yĕnnam̐ga śhrīveṁkaḍeśha yiṁtasesi kūḍidivi
innesi nī vinayāla kiyyagŏnarādā