Samdu galigidem jaalu samkam bettevu

సందు గలిగితేఁ జాలు చంకఁ బెట్టేవు
Language

(॥పల్లవి॥)
సందు గలిగితేఁ జాలు చంకఁ బెట్టేవు
యెందరిఁ బెండ్లాడితివో ఇటువలె నీవు

(॥సందు॥)
వేడుకకు నీకు నాపె విందు చెప్పవచ్చితేను
యాడనే మోవితేనియ నిమ్మనేవు
వాడికకు వచ్చి నీవద్ద నిట్టె కూచుండితే
తోడనే యింతలో నీతొడ యెక్కుమనేవు

(॥సందు॥)
తామరపువ్వులు నీకు తగఁ గానుకిచ్చితేను
చేముంచి యాకెను నీవు చెయివట్టేవు
ప్రేమముతో విడెమిచ్చి ప్రియములు చెప్పితేను
గోమునఁ బెంచేచన్నులు గోర నూఁదేవు

(॥సందు॥)
మలసి యలమేలుమంగ మాటలు నీతో నాడితే
పలుమారు మోమే తప్పక చూచేవు
యెలమి శ్రీవేంకటేశ యాకె నిట్టె కూడితివి
సెలవుల నవ్వితేనే సేసవెట్టేవు

(||pallavi||)
saṁdu galigidem̐ jālu saṁkam̐ bĕṭṭevu
yĕṁdarim̐ bĕṁḍlāḍidivo iḍuvalĕ nīvu

(||saṁdu||)
veḍugagu nīgu nābĕ viṁdu sĕppavachchidenu
yāḍane movideniya nimmanevu
vāḍigagu vachchi nīvadda niṭṭĕ kūsuṁḍide
toḍane yiṁtalo nīdŏḍa yĕkkumanevu

(||saṁdu||)
tāmarabuvvulu nīgu tagam̐ gānugichchidenu
semuṁchi yāgĕnu nīvu sĕyivaṭṭevu
premamudo viḍĕmichchi priyamulu sĕppidenu
gomunam̐ bĕṁchesannulu gora nūm̐devu

(||saṁdu||)
malasi yalamelumaṁga māḍalu nīdo nāḍide
palumāru mome tappaga sūsevu
yĕlami śhrīveṁkaḍeśha yāgĕ niṭṭĕ kūḍidivi
sĕlavula navvidene sesavĕṭṭevu