Saluvagu vemdigi samgadayyeenaa

చలువకు వేఁడికి సంగతయ్యీనా
Language

(॥పల్లవి॥)
చలువకు వేఁడికి సంగతయ్యీనా
నెలతఁలఁ గంటే నిట్టే నీ వేమి సేతువు

(॥చలు॥)
పెక్కుమారులు నేనైతే ప్రియములు చెప్పఁగాను
పక్కన నీవాడేవు పాడిపంతాలు
వక్కణతో వేఁడుకొనేవారిఁ గంటే బిగుతురు
నిక్కినవారిసాజాలు నీ వేమి సేతువు

(॥చలు॥)
ననువుగా నే నీతో నవ్వు లిట్టే నవ్వఁగాను
చనవిచ్చి నీవైతే జంకింతువు
వొనరినవారిఁ గంటే వొత్తుకొత్తుక వత్తురు
నినుపై లోకులజాడే నీ వేమిసేతువు

(॥చలు॥)
కందువ నే నిన్నుఁ గూడి కాఁగిలించుకోఁగాను
చెంది నీవు మోవి గంటిసేయఁజూచేవు
ముందే శ్రీవేంకటేశ్వర మొక్కితే దీవింతురు
నిందలేని వారినేర్పు నీ వేమి సేతువు

(||pallavi||)
saluvagu vem̐ḍigi saṁgadayyīnā
nĕladam̐lam̐ gaṁṭe niṭṭe nī vemi seduvu

(||salu||)
pĕkkumārulu nenaide priyamulu sĕppam̐gānu
pakkana nīvāḍevu pāḍibaṁtālu
vakkaṇado vem̐ḍugŏnevārim̐ gaṁṭe biguduru
nikkinavārisājālu nī vemi seduvu

(||salu||)
nanuvugā ne nīdo navvu liṭṭe navvam̐gānu
sanavichchi nīvaide jaṁkiṁtuvu
vŏnarinavārim̐ gaṁṭe vŏttugŏttuga vatturu
ninubai logulajāḍe nī vemiseduvu

(||salu||)
kaṁduva ne ninnum̐ gūḍi kām̐giliṁchugom̐gānu
sĕṁdi nīvu movi gaṁṭiseyam̐jūsevu
muṁde śhrīveṁkaḍeśhvara mŏkkide dīviṁturu
niṁdaleni vārinerbu nī vemi seduvu