Sallare haribai jaajarajaaja

చల్లరే హరిపై జాజరజాజ
Language

(॥పల్లవి॥)
చల్లరే హరిపై జాజరజాజ
చల్లఁగా సరసపు జాజరజాజ

(॥చల్ల॥)
సతతపు వలపుల జాజరజాజ
చతురులమాటల జాజరజాజ
సతమగు నవ్వుల జాజరజాజ
జతనపు సిగ్గుల జాజరజాజ

(॥చల్ల॥)
సముకపు కొసరుల జాజరజాజ
సమరతికరఁగుల జాజరజాజ
జమళి తమకముల జాజరజాజ
సమయని యాసల జాజరజాజ

(॥చల్ల॥)
జడియని పంతపు జాజరజాజ
సడఁగుల చేఁతల జాజరజాజ
జడిగొనుచెమటల జాజరజాజ
జడగొను పెనఁగుల జాజరజాజ

(॥చల్ల॥)
చలముల వొట్ల జాజరజాజ
సలియెలపగటుల జాజరజాజ
చలువల వినయపు జాజరజాజ
సళువుల చూపుల జాజరజాజ

(॥చల్ల॥)
సంగడి మూఁకల జాజరజాజ
జంగిలి మతకపు జాజరజాజ
సంగాత మమరిన జాజరజాజ
సంగతి యెరికల జాజరజాజ

(॥చల్ల॥)
సారపు మోవుల జాజరజాజ
సారెకుఁ బొలసేటి జాజరజాజ
సౌరుచి మెచ్చుల జాజరజాజ
జారతనంబుల జాజరజాజ

(॥చల్ల॥)
సందడి కొలువుల జాజరజాజ
సందుల వొత్తుల జాజరజాజ
చందురుపాటల జాజరజాజ
సందె చీఁకటుల జాజరజాజ

(॥చల్ల॥)
చాలుకొను సతుల జాజరజాజ
జాలివిరహముల జాజరజాజ
చాలామరిగిన జాజరజాజ
చౌలూరించే జాజరజాజ

(॥చల్ల॥)
చెనుఁగవ గురుతుల జాజరజాజ
చనవుల కొసరుల జాజరజాజ
యెనసెను శ్రీవేంకటేశ్వరుఁ డీతని
చనుమానంబుల జాజరజాజ

(||pallavi||)
sallare haribai jājarajāja
sallam̐gā sarasabu jājarajāja

(||salla||)
sadatabu valabula jājarajāja
sadurulamāḍala jājarajāja
sadamagu navvula jājarajāja
jadanabu siggula jājarajāja

(||salla||)
samugabu kŏsarula jājarajāja
samaradigaram̐gula jājarajāja
jamaḽi tamagamula jājarajāja
samayani yāsala jājarajāja

(||salla||)
jaḍiyani paṁtabu jājarajāja
saḍam̐gula sem̐tala jājarajāja
jaḍigŏnusĕmaḍala jājarajāja
jaḍagŏnu pĕnam̐gula jājarajāja

(||salla||)
salamula vŏṭla jājarajāja
saliyĕlabagaḍula jājarajāja
saluvala vinayabu jājarajāja
saḽuvula sūbula jājarajāja

(||salla||)
saṁgaḍi mūm̐kala jājarajāja
jaṁgili madagabu jājarajāja
saṁgāda mamarina jājarajāja
saṁgadi yĕrigala jājarajāja

(||salla||)
sārabu movula jājarajāja
sārĕgum̐ bŏlaseḍi jājarajāja
saurusi mĕchchula jājarajāja
jāradanaṁbula jājarajāja

(||salla||)
saṁdaḍi kŏluvula jājarajāja
saṁdula vŏttula jājarajāja
saṁdurubāḍala jājarajāja
saṁdĕ sīm̐kaḍula jājarajāja

(||salla||)
sālugŏnu sadula jājarajāja
jālivirahamula jājarajāja
sālāmarigina jājarajāja
saulūriṁche jājarajāja

(||salla||)
sĕnum̐gava gurudula jājarajāja
sanavula kŏsarula jājarajāja
yĕnasĕnu śhrīveṁkaḍeśhvarum̐ ḍīdani
sanumānaṁbula jājarajāja