Sallaniraajaa o samdamaama

చల్లనిరాజా ఓ చందమామ
Work
Year
Language

పల్లవి:

చల్లనిరాజా ఓ చందమామ
చల్లనిరాజా ఓ చందమామ
నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ నా చందమామ
చల్లనిరాజా ఓ చందమామ
నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ నా చందమామ

చరణం 1:

పరమేశుని జడలోన చామంతివి
నీలిమేఘాల నానేటి పూబంతివి
పరమేశుని జడలోన చామంతివి
నీలిమేఘాల నానేటి పూబంతివి
నిను సేవించగా నను దయచూడవా
ఓ వెన్నెల వన్నెల నా చందమామ //చల్లని రాజా//

చరణం 2:

నిను చూచిన మనసెంతో వికసించుగా
తొలి కోరికలెన్నో చిగురించుగా
ఆశలూరించునే చెలి కనిపించునే
చిరునవ్వుల వెన్నెల కురిపించులే //చల్లని రాజా//

చరణం 3:

నను చూడవు పిలచిన మాట్లాడవు
చిన్నదానను వదలను ప్రియురాలను
నను చూడవు పిలచిన మాట్లాడవు
చిన్నదానను వదలను ప్రియురాలను
నిన్నే కోరానురా నన్నే కరుణించరా
ఈ వెన్నెల కన్నెతో విహరించరా //చల్లని రాజా//

pallavi:

sallanirājā o saṁdamāma
sallanirājā o saṁdamāma
nī kathalanni tĕlisāyi o saṁdamāma nā saṁdamāma
sallanirājā o saṁdamāma
nī kathalanni tĕlisāyi o saṁdamāma nā saṁdamāma

saraṇaṁ 1:

parameśhuni jaḍalona sāmaṁtivi
nīlimeghāla nāneḍi pūbaṁtivi
parameśhuni jaḍalona sāmaṁtivi
nīlimeghāla nāneḍi pūbaṁtivi
ninu seviṁchagā nanu dayasūḍavā
o vĕnnĕla vannĕla nā saṁdamāma //sallani rājā//

saraṇaṁ 2:

ninu sūsina manasĕṁto vigasiṁchugā
tŏli korigalĕnno siguriṁchugā
āśhalūriṁchune sĕli kanibiṁchune
sirunavvula vĕnnĕla kuribiṁchule //sallani rājā//

saraṇaṁ 3:

nanu sūḍavu pilasina māṭlāḍavu
sinnadānanu vadalanu priyurālanu
nanu sūḍavu pilasina māṭlāḍavu
sinnadānanu vadalanu priyurālanu
ninne korānurā nanne karuṇiṁcharā
ī vĕnnĕla kannĕdo vihariṁcharā //sallani rājā//