Sala mimkam baniledu jalajaakshi kadusaadu

చల మిఁకఁ బనిలేదు జలజాక్షి కడుసాదు
Language

(॥పల్లవి॥)
చల మిఁకఁ బనిలేదు జలజాక్షి కడుసాదు
యెలమితో నిట్టె మాయింటికి రారాదా

(॥చల॥)
చేరి యింతి ప్రియములే చెప్పీ నిదే నీకుఁ జాటి
కోరికలైతే మదిఁ గోటానఁగోటి
మేర మీరరాదు యీపెమేనరిక మిఁకఁ బోదు
యీరీతి మమ్ము మన్నించి ఇంటికి రారాదా

(॥చల॥)
కొమ్మ నిన్నుఁ దలపోసి కురిసీఁ జెమటవాన
చిమ్మి రేఁగేవలపైతే సేనాసేన
నమ్మిన చుట్టాలు మీరు నంటున నొద్దికైనారు
ఇమ్ముల నీకు మొక్కేము ఇంటికి రారాదా

(॥చల॥)
యెన్నఁడుఁ బాయనిరతి యీకె నీమోహపుటాలు
విన్నపములెల్లాఁ జేసీ వేవేలు
చిన్ననాఁడె యీడుచూపె శ్రీవేంకటేశుఁడ యీపె
యెన్నికగాఁ గూడితివి ఇంటికి రారాదా

(||pallavi||)
sala mim̐kam̐ baniledu jalajākṣhi kaḍusādu
yĕlamido niṭṭĕ māyiṁṭigi rārādā

(||sala||)
seri yiṁti priyamule sĕppī nide nīgum̐ jāḍi
korigalaide madim̐ goḍānam̐goḍi
mera mīrarādu yībĕmenariga mim̐kam̐ bodu
yīrīdi mammu manniṁchi iṁṭigi rārādā

(||sala||)
kŏmma ninnum̐ dalabosi kurisīm̐ jĕmaḍavāna
simmi rem̐gevalabaide senāsena
nammina suṭṭālu mīru naṁṭuna nŏddigaināru
immula nīgu mŏkkemu iṁṭigi rārādā

(||sala||)
yĕnnam̐ḍum̐ bāyaniradi yīgĕ nīmohabuḍālu
vinnabamulĕllām̐ jesī vevelu
sinnanām̐ḍĕ yīḍusūbĕ śhrīveṁkaḍeśhum̐ḍa yībĕ
yĕnnigagām̐ gūḍidivi iṁṭigi rārādā