Sakkani maanini nee sari yevvare

చక్కని మానిని నీ సరి యెవ్వరె
Language

(॥పల్లవి॥)
చక్కని మానిని నీ సరి యెవ్వరె
యెక్కువైన నీభావ మెంచిచూడ వసమా

(॥చక్క॥)
కోమలి నీకుచముల కొండలకొనలపొంత
వోముచు మించి నిలిచె నొకసింహము
కాముఁడు జఘనమనేకట్టు బండిమీఁద బెట్టి
దీమముతో వేటలాడీఁ దేరిచూడవసమా

(॥చక్క॥)
పడఁతి లేఁజిగురులపాదపుటడవిలోన
నడపుల యేనుగులు నటిఇంచఁగా
తొడలరటికంబాలతోఁ గట్టి దీములుగా
బడిబడి వేటలాడీ భావించవసమా

(॥చక్క॥)
అంగనముఖమనేటి అంబుజాకరముపొంత
ముంగిటఁజూపులలేళ్లు మోహరించఁగా
కఁగనిశ్రీవేంకటేశుకాఁగిటిభావానఁ గట్టి
చెంగటనే వేటలాడీఁ జిత్తగించవసమా

(||pallavi||)
sakkani mānini nī sari yĕvvarĕ
yĕkkuvaina nībhāva mĕṁchisūḍa vasamā

(||sakka||)
komali nīgusamula kŏṁḍalagŏnalabŏṁta
vomusu miṁchi nilisĕ nŏgasiṁhamu
kāmum̐ḍu jaghanamanegaṭṭu baṁḍimīm̐da bĕṭṭi
dīmamudo veḍalāḍīm̐ derisūḍavasamā

(||sakka||)
paḍam̐ti lem̐jigurulabādabuḍaḍavilona
naḍabula yenugulu naḍiiṁcham̐gā
tŏḍalaraḍigaṁbāladom̐ gaṭṭi dīmulugā
baḍibaḍi veḍalāḍī bhāviṁchavasamā

(||sakka||)
aṁganamukhamaneḍi aṁbujāgaramubŏṁta
muṁgiḍam̐jūbulaleḽlu mohariṁcham̐gā
kam̐ganiśhrīveṁkaḍeśhugām̐giḍibhāvānam̐ gaṭṭi
sĕṁgaḍane veḍalāḍīm̐ jittagiṁchavasamā