సగము మానిసిరూపు సగము మెగమురూపు
(॥పల్లవి॥)
సగము మానిసిరూపు సగము మెగమురూపు
అగణితప్రతాపుఁ డహోబలేశుఁడు
(॥॥)
గద్దెమీఁదఁ గూచున్నాఁడు కంబములోఁ బుట్టినాఁడు
కొద్దిమీరఁ గడునవ్వుకొంటా నున్నాఁడు
వొద్దనె శ్రీ సతిచన్ను లొరయుచు నున్నవాఁడు
అద్దివో చూడరమ్మ అహోబలేశుఁడు
(॥॥)
పెనుమీసాలవాఁడు పెదపెదగోళ్లవాఁడు
ఘనునిఁగాఁ బ్రహ్లాదునిగాఁ గాచుకున్నాఁడు
మనసిచ్చినసురలతో మాటలాడుచున్నవాఁడు
అనుపమతేజఁడమ్మ అహోబలేశుఁడు
(॥॥)
వేవేలుచేతులవాఁడు వెన్నెలచాయలవాఁడు
భావించి కొల్లినవారిపాలిటివాఁడు
శ్రీ వేంకటగిరిమీఁదఁ జేరి భవనాశిదండ
నావల నీవల మించె నహోబలేశుఁడు
(||pallavi||)
sagamu mānisirūbu sagamu mĕgamurūbu
agaṇidapradābum̐ ḍahobaleśhum̐ḍu
(||||)
gaddĕmīm̐dam̐ gūsunnām̐ḍu kaṁbamulom̐ buṭṭinām̐ḍu
kŏddimīram̐ gaḍunavvugŏṁṭā nunnām̐ḍu
vŏddanĕ śhrī sadisannu lŏrayusu nunnavām̐ḍu
addivo sūḍaramma ahobaleśhum̐ḍu
(||||)
pĕnumīsālavām̐ḍu pĕdabĕdagoḽlavām̐ḍu
ghanunim̐gām̐ brahlādunigām̐ gāsugunnām̐ḍu
manasichchinasuralado māḍalāḍusunnavām̐ḍu
anubamadejam̐ḍamma ahobaleśhum̐ḍu
(||||)
vevelusedulavām̐ḍu vĕnnĕlasāyalavām̐ḍu
bhāviṁchi kŏllinavāribāliḍivām̐ḍu
śhrī veṁkaḍagirimīm̐dam̐ jeri bhavanāśhidaṁḍa
nāvala nīvala miṁchĕ nahobaleśhum̐ḍu