సకలము నెరిఁగిన జాణఁ డితఁడు
(॥పల్లవి॥)
సకలము నెరిఁగిన జాణఁ డితఁడు
మొక మెందాఁకాఁ జూచేవు మొక్కఁగదవే
(॥సకల॥)
విన్నవించవే నీవు విభునికి మనవులు
సన్నలా చాయలా నేమి సాదించేవు
పన్నుక వద్దఁ గూచుండి పాదా లొత్తఁగదవే
చన్నుల నీతని నేమి సరిఁ దాఁకించేవు
(॥సకల॥)
నవ్వవే యాతనితోను ననుపులు సేసుకొని
పువ్వుల నేమివేసేవు పూఁచి పూఁచి
వువ్విళ్లూర మోవి యిచ్చి వొడఁబరచుకొనవే
చువ్వన నీతని నేమి చొక్కులఁబెట్టేవు
(॥సకల॥)
ఆకు మడిచియ్యవే అట్టె బాగా లొసఁగి
దాకొని వూరకే యంత తమిరేఁచేవు
యీకడ శ్రీవేంకటేశుఁడేలె నిన్ను మెచ్చఁగదె
మేకుల నీతని నెంత మేలమాడేవు
(||pallavi||)
sagalamu nĕrim̐gina jāṇam̐ ḍidam̐ḍu
mŏga mĕṁdām̐kām̐ jūsevu mŏkkam̐gadave
(||sagala||)
vinnaviṁchave nīvu vibhunigi manavulu
sannalā sāyalā nemi sādiṁchevu
pannuga vaddam̐ gūsuṁḍi pādā lŏttam̐gadave
sannula nīdani nemi sarim̐ dām̐kiṁchevu
(||sagala||)
navvave yādanidonu nanubulu sesugŏni
puvvula nemivesevu pūm̐si pūm̐si
vuvviḽlūra movi yichchi vŏḍam̐barasugŏnave
suvvana nīdani nemi sŏkkulam̐bĕṭṭevu
(||sagala||)
āgu maḍisiyyave aṭṭĕ bāgā lŏsam̐gi
dāgŏni vūrage yaṁta tamirem̐sevu
yīgaḍa śhrīveṁkaḍeśhum̐ḍelĕ ninnu mĕchcham̐gadĕ
megula nīdani nĕṁta melamāḍevu