చదువు రాని వాడవని దిగులు చెందకు
పల్లవి:
చదువు రాని వాడవని దిగులు చెందకు ..మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు(2)
మంచు వంటి మల్లె వంటి మంచి మనసుతో ..జీవించలేని పనికిరాని బ్రతుకులెందుకు
||చదువు రాని వాడవని దిగులు చెందకు||
చరణం 1:
ఏమి చదివి పక్షులు పైకెగుర గలిగేను
ఏ చదువు వల్ల చేపపిల్ల లీదగలిగెను
అడవిలోని నెమలికెవడు ఆట నేర్పేను
అడవిలోని నెమలికెవడు ఆట నేర్పేను ...కొమ్మ పైని కోయిలమ్మ కెవడు పాట నేర్పేను !!
||చదువు రాని వాడవని దిగులు చెందకు||
చరణం 2:
తెలివి లేని లేగ దూడ పిలుచుని అంబా అని
యేమెరుగని చంటి పాప యేడ్చును అమ్మా అని
చదువులతో పని యేమి హృదయం ఉన్న చాలు
చదువులతో పని యేమి హృదయం ఉన్న చాలు ..కాయితంబు పూల కన్న గరిక పూవు మేలు !!
||చదువు రాని వాడవని దిగులు చెందకు||
pallavi:
saduvu rāni vāḍavani digulu sĕṁdagu ..maniṣhi madilona mamada leni saduvulĕṁdugu(2)
maṁchu vaṁṭi mallĕ vaṁṭi maṁchi manasudo ..jīviṁchaleni panigirāni bradugulĕṁdugu
||saduvu rāni vāḍavani digulu sĕṁdagu||
saraṇaṁ 1:
emi sadivi pakṣhulu paigĕgura galigenu
e saduvu valla sebabilla līdagaligĕnu
aḍaviloni nĕmaligĕvaḍu āḍa nerbenu
aḍaviloni nĕmaligĕvaḍu āḍa nerbenu ...kŏmma paini koyilamma kĕvaḍu pāḍa nerbenu !!
||saduvu rāni vāḍavani digulu sĕṁdagu||
saraṇaṁ 2:
tĕlivi leni lega dūḍa pilusuni aṁbā ani
yemĕrugani saṁṭi pāba yeḍchunu ammā ani
saduvulado pani yemi hṛdayaṁ unna sālu
saduvulado pani yemi hṛdayaṁ unna sālu ..kāyidaṁbu pūla kanna gariga pūvu melu !!
||saduvu rāni vāḍavani digulu sĕṁdagu||