సతుల పట్టుకు నింతచండి సేతురా
(॥పల్లవి॥)
సతుల పట్టుకు నింతచండి సేతురా
తతిగొంటి వెటువంటి తగవో నీది
(॥సతు॥)
మనసు రంజిల్ల నీతో మాటలాడీ నీదేవులు
పనిలేని దిప్పుడేడ పరాకో నీకు
వొనర నప్పటి నీవొడివట్టి తియ్యఁగాను
పెనఁగేవు యెటువంటిబిగువో నీది
(॥సతు॥)
యెరవులేక చేతెలెత్తి మొక్కీ నీదేవులు
శిరసువంచే వెంతసిగ్గో నీకు
గరిమ నీ మొగమే కనుఁగొనుచుండఁగాను
తరల వేమిటా నెంతతాలిమో నీకు
(॥సతు॥)
కప్పురము మోవిని(కి?) చ్చి కాఁగిలించీ నీదేవులు
ముప్పిరిఁ గూడేవు యెంతమోహమో నీకు
యిప్పుడే శ్రీవేంకటేశ యీకె నిన్ను మెచ్చఁగాను
చొప్పునఁ గొసరే వెంతాసోదమో నీది
(||pallavi||)
sadula paṭṭugu niṁtasaṁḍi sedurā
tadigŏṁṭi vĕḍuvaṁṭi tagavo nīdi
(||sadu||)
manasu raṁjilla nīdo māḍalāḍī nīdevulu
panileni dippuḍeḍa parāgo nīgu
vŏnara nappaḍi nīvŏḍivaṭṭi tiyyam̐gānu
pĕnam̐gevu yĕḍuvaṁṭibiguvo nīdi
(||sadu||)
yĕravulega sedĕlĕtti mŏkkī nīdevulu
śhirasuvaṁche vĕṁtasiggo nīgu
garima nī mŏgame kanum̐gŏnusuṁḍam̐gānu
tarala vemiḍā nĕṁtadālimo nīgu
(||sadu||)
kappuramu movini(ki?) schi kām̐giliṁchī nīdevulu
muppirim̐ gūḍevu yĕṁtamohamo nīgu
yippuḍe śhrīveṁkaḍeśha yīgĕ ninnu mĕchcham̐gānu
sŏppunam̐ gŏsare vĕṁtāsodamo nīdi