సతుల మిందరమును సంతోసించేము
(॥పల్లవి॥)
సతుల మిందరమును సంతోసించేము
తతివచ్చె నిఁక నిట్టె దాఁచకువయ్యా
(॥సతు॥)
కన్నులనే నవ్వుతాను కలకల మాటాడుతా
వున్నది చెలియ నేఁడు వుల్లసానను
మన్నించిననీసుద్దులు మాతోఁ జెప్ప సిగ్గువడీ
అన్నియు నీవైనా నానతియ్యవయ్యా
(॥సతు॥)
మోమునఁ గళదేరుతా ముచ్చటలు నెరపుతా
వేమారుఁ జెలరేఁగీని వేడుకలను
నీమోహపుగుఱుతులు నే మడిగితే దాఁచీ
ఆముకొని నీవైనా నానతియ్యవయ్యా
(॥సతు॥)
మోనిఁదేనె లొలుకతా ముంచిసరసమమాడుతా
వోవరిలో నిన్నుఁగూడి వున్నదిపుడు
శ్రీవేంకటేశుఁడ నే మెఁచితేఁ దానే తలవంచీ
ఆవిధము నీవైనా నానతియ్యవయ్యా
(||pallavi||)
sadula miṁdaramunu saṁtosiṁchemu
tadivachchĕ nim̐ka niṭṭĕ dām̐saguvayyā
(||sadu||)
kannulane navvudānu kalagala māḍāḍudā
vunnadi sĕliya nem̐ḍu vullasānanu
manniṁchinanīsuddulu mādom̐ jĕppa sigguvaḍī
anniyu nīvainā nānadiyyavayyā
(||sadu||)
momunam̐ gaḽaderudā muchchaḍalu nĕrabudā
vemārum̐ jĕlarem̐gīni veḍugalanu
nīmohabuguṟudulu ne maḍigide dām̐sī
āmugŏni nīvainā nānadiyyavayyā
(||sadu||)
monim̐denĕ lŏlugadā muṁchisarasamamāḍudā
vovarilo ninnum̐gūḍi vunnadibuḍu
śhrīveṁkaḍeśhum̐ḍa ne mĕm̐sidem̐ dāne talavaṁchī
āvidhamu nīvainā nānadiyyavayyā