(॥పల్లవి॥)
చదివితినందువు జాణనందువు
యెదుటఁ గొంచేవు రాజ్య మెట్ల నేలితివో
(॥చది॥)
అఁటదియైతేఁజాలు నట్టె చూచి భ్రమతువు
యీటుతోడ యెగ్గుసిగ్గు లెంచవు నీవు
పాటలువాడితేఁజాలు భ్రమసి చొక్కుదువు
వాఁటముగఁ; దొల్లి దొడ్డవాఁడ వెట్లనైతివో
(॥చది॥)
మొగము చూచితేఁజాలు మొక్కులే మొక్కుదువు
సొగిసి నవ్వేవారిఁ జూడవు నీవు
పొగడి మెచ్చితేఁజాలు పొందులెల్లాఁ జేతువు
తగవుతోఁ దొల్లి దొరతన మెట్లఁ జేతువో
(॥చది॥)
సరుసఁ గూచుంటేఁజాలు చలపట్టి కూడుదువు
సరవితోదొడ్డు గొంచములెంచవు
గొరబై శ్రీవేంకటేశ కూడితివి నన్ను నిట్టె
పొరిఁ దొల్లి గొల్లెతలభోగమెట్లఁ జేతువో
(||pallavi||)
sadividinaṁduvu jāṇanaṁduvu
yĕduḍam̐ gŏṁchevu rājya mĕṭla nelidivo
(||sadi||)
am̐ṭadiyaidem̐jālu naṭṭĕ sūsi bhramaduvu
yīḍudoḍa yĕggusiggu lĕṁchavu nīvu
pāḍaluvāḍidem̐jālu bhramasi sŏkkuduvu
vām̐ṭamugam̐; dŏlli dŏḍḍavām̐ḍa vĕṭlanaidivo
(||sadi||)
mŏgamu sūsidem̐jālu mŏkkule mŏkkuduvu
sŏgisi navvevārim̐ jūḍavu nīvu
pŏgaḍi mĕchchidem̐jālu pŏṁdulĕllām̐ jeduvu
tagavudom̐ dŏlli dŏradana mĕṭlam̐ jeduvo
(||sadi||)
sarusam̐ gūsuṁṭem̐jālu salabaṭṭi kūḍuduvu
saravidodŏḍḍu gŏṁchamulĕṁchavu
gŏrabai śhrīveṁkaḍeśha kūḍidivi nannu niṭṭĕ
pŏrim̐ dŏlli gŏllĕdalabhogamĕṭlam̐ jeduvo