Sadi yittidaidene samsaaraphalamu

సతి యిట్టిదైతేనే సంసారఫలము
Language

(॥పల్లవి॥)
సతి యిట్టిదైతేనే సంసారఫలము
కతలిన్ని నీయందే కలవే వోచెలియా

(॥తి॥)
చెప్పినబుద్దులు విని చిత్తములోన మెలఁగి
తప్పక సేవసేసేది తరుణి
ముప్పిరి నితవుతోడ ముచ్చటలచ్చటలాడి
యెప్పుడూఁ బాయకుండేది ఇల్లాలు

(॥తి॥)
వొపిక గలిగి పతి కొడఁబడ బత్తి చూపి
కాఁపురము నేసేదే గరితె
యేపున వహించుకొని యింటిపను లేమరక
చేపట్టుగుంచమైనది సేసపాలమగువ

(॥తి॥)
యిచ్చకమెఱిఁగి తనయిలువరుస నెరసి
నిచ్చఁ బతిఁగూడినదే నెరవాది
హెచ్చి నీవూ శ్రీవేంకటేశుఁడూ దొరసినట్టు
అచ్చపుగుణాల నెక్కుడైనదే వనిత

(||pallavi||)
sadi yiṭṭidaidene saṁsāraphalamu
kadalinni nīyaṁde kalave vosĕliyā

(||ti||)
sĕppinabuddulu vini sittamulona mĕlam̐gi
tappaga sevasesedi taruṇi
muppiri nidavudoḍa muchchaḍalachchaḍalāḍi
yĕppuḍūm̐ bāyaguṁḍedi illālu

(||ti||)
vŏbiga galigi padi kŏḍam̐baḍa batti sūbi
kām̐puramu nesede garidĕ
yebuna vahiṁchugŏni yiṁṭibanu lemaraga
sebaṭṭuguṁchamainadi sesabālamaguva

(||ti||)
yichchagamĕṟim̐gi tanayiluvarusa nĕrasi
nichcham̐ badim̐gūḍinade nĕravādi
hĕchchi nīvū śhrīveṁkaḍeśhum̐ḍū dŏrasinaṭṭu
achchabuguṇāla nĕkkuḍainade vanida