సడి సెయకో గాలీ సడి సేయబోకే
పల్లవి:
సడి సెయకో గాలీ సడి సేయబోకే ||2||
బడలి ఒడిలో రాజు పవ్వలించేనే
చరణం 1:
రత్నపీఠిక లేని రారాజు నా స్వామీ
మణి కిరీటము లేని మహరాజు గాకేమీ
చిలిపి పరుగుల మానీ కొలిచి పోరాదే
చరణం 2:
ఏటి గలగలలకే ఎగసి లేచేనే
ఆకు కదలికలకే అదరి చూచేనే
నిదుర చెదరిందంటే నేనూరుకోనే
చరణం 3:
పండు వెన్నెలనడిగి పాన్పు తేరాదే
క్రీడ మబ్బుల దాగు నిదుర తేరాదే
విరుల వీవెన బూని విసిరిపోరాదే
pallavi:
saḍi sĕyago gālī saḍi seyaboge ||2||
baḍali ŏḍilo rāju pavvaliṁchene
saraṇaṁ 1:
ratnabīṭhiga leni rārāju nā svāmī
maṇi kirīḍamu leni maharāju gāgemī
silibi parugula mānī kŏlisi porāde
saraṇaṁ 2:
eḍi galagalalage ĕgasi lesene
āgu kadaligalage adari sūsene
nidura sĕdariṁdaṁṭe nenūrugone
saraṇaṁ 3:
paṁḍu vĕnnĕlanaḍigi pānpu terāde
krīḍa mabbula dāgu nidura terāde
virula vīvĕna būni visiriborāde