సారె సారె నితనితో సరసము లాడేవు
(॥పల్లవి॥)
సారె సారె నితనితో సరసము లాడేవు
యేరుపరచి నీ వల పింకా నెంత గలదే
(॥సారె॥)
వేడుకుతో వేగినంతా విచ్చనవిడి నీమాఁట -
లాడితి వితనికి నేమౌదువే నీవు
గోడ నిక్కి చూచి నిన్నఁ గొసరితివి సన్నల
నీడు జోడై వుందానవు యెన్నటి చుట్టమవే
(॥సారె॥)
మచ్చికతో వీడె మిచ్చి మంచముపై నుందానవు
చొచ్చి యెన్నాళ్లనుండి కాచుక వుంటివే
పచ్చిదేర మోము చూపి పకపక నవ్వేవు
ముచ్చట నిందె కెన్ని నోములు నోమితివే
(॥సారె॥)
కోరి శ్రీవేంకటేశ్వరుఁ గూడిన నీ భూమిమీఁద
పోరచిగా నెటువలెఁ బొడమితివే
యీరీతి నిన్ను మన్నించి యీతఁడిట్టె యేలినాఁడు
గారాబాన నీ వెందుండి కలిగితివే
(||pallavi||)
sārĕ sārĕ nidanido sarasamu lāḍevu
yerubarasi nī vala piṁkā nĕṁta galade
(||sārĕ||)
veḍugudo veginaṁtā vichchanaviḍi nīmām̐ṭa -
lāḍidi vidanigi nemauduve nīvu
goḍa nikki sūsi ninnam̐ gŏsaridivi sannala
nīḍu joḍai vuṁdānavu yĕnnaḍi suṭṭamave
(||sārĕ||)
machchigado vīḍĕ michchi maṁchamubai nuṁdānavu
sŏchchi yĕnnāḽlanuṁḍi kāsuga vuṁṭive
pachchidera momu sūbi pagabaga navvevu
muchchaḍa niṁdĕ kĕnni nomulu nomidive
(||sārĕ||)
kori śhrīveṁkaḍeśhvarum̐ gūḍina nī bhūmimīm̐da
porasigā nĕḍuvalĕm̐ bŏḍamidive
yīrīdi ninnu manniṁchi yīdam̐ḍiṭṭĕ yelinām̐ḍu
gārābāna nī vĕṁduṁḍi kaligidive