Saalune nee maamtalu saalu moolagekkeraa

చాలునే నీ మాఁటలు చాలు మూలకెక్కెరా
Language

(॥పల్లవి॥)
చాలునే నీ మాఁటలు చాలు మూలకెక్కెరా
నేలఁ జూపేవా పదారువేలవాఁడ వౌదురా

(॥చాలు॥)
వొంటినుందాన వదేమే వొంటియు నొంటకె పోరా
అంటఁగా వోచెలియ గోరంట కౌనౌరా
గొటుజాణతనమేలే కూళతనాలేలరా
కంటినే నీజాడ బండికంటిజాడలటరా

(॥చాలు॥)
వీడనాడేవేమే నీవీడనాడ నుండఁగఁబో
జోడుగదే నేను అవురా జోడగుటౌళి
మేడిసేసేవటే నీవు మేడిపండె నీగుణాలు
వోడ వేమిటాను నీవావోడతో దూలమురా

(॥చాలు॥)
యింతయేలే నాతోఁ గారింతలు నీవల్లనే పో
సంతమైతినే వో వసంతకాఁడవా
పంతపు శ్రీవేంకటాద్రిపతి నేఁ గూడితిఁగదే
పంతము పాడియుఁగలపడఁతిరా నేను

(||pallavi||)
sālune nī mām̐ṭalu sālu mūlagĕkkĕrā
nelam̐ jūbevā padāruvelavām̐ḍa vaudurā

(||sālu||)
vŏṁṭinuṁdāna vademe vŏṁṭiyu nŏṁṭagĕ porā
aṁṭam̐gā vosĕliya goraṁṭa kaunaurā
gŏḍujāṇadanamele kūḽadanālelarā
kaṁṭine nījāḍa baṁḍigaṁṭijāḍalaḍarā

(||sālu||)
vīḍanāḍeveme nīvīḍanāḍa nuṁḍam̐gam̐bo
joḍugade nenu avurā joḍaguḍauḽi
meḍisesevaḍe nīvu meḍibaṁḍĕ nīguṇālu
voḍa vemiḍānu nīvāvoḍado dūlamurā

(||sālu||)
yiṁtayele nādom̐ gāriṁtalu nīvallane po
saṁtamaidine vo vasaṁtagām̐ḍavā
paṁtabu śhrīveṁkaḍādribadi nem̐ gūḍidim̐gade
paṁtamu pāḍiyum̐galabaḍam̐tirā nenu