Saalumjaalunanave jaanadanaalu

చాలుఁజాలుననవే జాణతనాలు
Language

(॥పల్లవి॥)
చాలుఁజాలుననవే జాణతనాలు
కోలుముందాయఁ బనులు కొసరింకా నేఁటికే

(॥చాలు॥)
చిగురుఁజేతలు గొన్ని చేఁగలచేఁతలు గొన్ని
నగుతా రెండూ నాతో నడపనేల
మొగములోఁ గానరాదా మోహము తనకు నాపై
వొగరులపులుసుల వొట్టు లింకానేఁటికే

(॥చాలు॥)
వెచ్చినమాటలు గొన్ని వేవనిమాటలు గొన్ని
లిఁచ్చముగా నాతో నాడీనేలే
ముచ్చటనే కానరాదా ముంచినతననిజము
నచ్చుకొట్టి నాతో నవ్వు లింకానేఁటికే

(॥చాలు॥)
పూఁచినసిగ్గులు గొన్ని పువ్వక సిగ్గులు గొన్ని
యేఁచి నాకాఁగిటిలోన యేల చల్లీనే
యీచాయ శ్రీవేంకటేశుఁ డింతసేసి నన్నుఁ గూడె
చూచిచూచి నన్నేల చొక్కులఁ బెట్టీనే

(||pallavi||)
sālum̐jālunanave jāṇadanālu
kolumuṁdāyam̐ banulu kŏsariṁkā nem̐ṭige

(||sālu||)
sigurum̐jedalu gŏnni sem̐galasem̐talu gŏnni
nagudā rĕṁḍū nādo naḍabanela
mŏgamulom̐ gānarādā mohamu tanagu nābai
vŏgarulabulusula vŏṭṭu liṁkānem̐ṭige

(||sālu||)
vĕchchinamāḍalu gŏnni vevanimāḍalu gŏnni
lim̐schamugā nādo nāḍīnele
muchchaḍane kānarādā muṁchinadananijamu
nachchugŏṭṭi nādo navvu liṁkānem̐ṭige

(||sālu||)
pūm̐sinasiggulu gŏnni puvvaga siggulu gŏnni
yem̐si nāgām̐giḍilona yela sallīne
yīsāya śhrīveṁkaḍeśhum̐ ḍiṁtasesi nannum̐ gūḍĕ
sūsisūsi nannela sŏkkulam̐ bĕṭṭīne