Saalumjaalu nimkanela saadimpulu

చాలుఁజాలు నిఁకనేల సాదింపులు
Language

(॥పల్లవి॥)
చాలుఁజాలు నిఁకనేల సాదింపులు
మీలోనిదాన నేను మీరే నేను

(॥చాలు॥)
కతలు నేరుచుఁ దాను కపటా లెరుఁగుఁ దాను
అతనితో నే మాటలాడఁగలనా
ఇతవరులైనవారు ఇచ్చకాలాడరే మీరు
మితిమీరితేఁజాలు మీరే నేను

(॥చాలు॥)
తప్పులు లేవు దనకు తగవ రిన్నిటాఁ దాను
దెప్పరమై తనతోను దీకొనేనా
చెప్పరానిచుట్టాలు సేవలు సేయరే మీరు
మెప్పించితేఁ జాలు మీరే నేను

(॥చాలు॥)
అన్నిటా జాణఁడు దాను అందాలకు వచ్చుఁ దాను
చన్నుల నొత్తితి నిఁక చలపట్టేనా
వున్నతి శ్రీవేంకటేశు నొనగూర్చితిరి మీరు
మిన్నక నవ్వఁగఁ దేరె మీరే నేను

(||pallavi||)
sālum̐jālu nim̐kanela sādiṁpulu
mīlonidāna nenu mīre nenu

(||sālu||)
kadalu nerusum̐ dānu kabaḍā lĕrum̐gum̐ dānu
adanido ne māḍalāḍam̐galanā
idavarulainavāru ichchagālāḍare mīru
midimīridem̐jālu mīre nenu

(||sālu||)
tappulu levu danagu tagava rinniḍām̐ dānu
dĕpparamai tanadonu dīgŏnenā
sĕpparānisuṭṭālu sevalu seyare mīru
mĕppiṁchidem̐ jālu mīre nenu

(||sālu||)
anniḍā jāṇam̐ḍu dānu aṁdālagu vachchum̐ dānu
sannula nŏttidi nim̐ka salabaṭṭenā
vunnadi śhrīveṁkaḍeśhu nŏnagūrsidiri mīru
minnaga navvam̐gam̐ derĕ mīre nenu