చాలుఁజాలు దీమసము సతిమాట వినవయ్య
(॥పల్లవి॥)
చాలుఁజాలు దీమసము సతిమాట వినవయ్య
మేలుగలవాఁడవు గామిడిచేఁతలేలా
(॥చాలు ॥)
అవ్వలిమోమైనపరా కంత గలవాఁడవైతే
జవ్వనిఁ గాంతలచే విచారించనేల
నవ్వకపిలిచినాను నాలిసేసేవాఁడవైతే
పువ్వులవలె నీమేను పులకించనేలా
(॥చాలు॥)
యింటిలోననుండి బీరా లింత గలవాఁడవైతే
అంటి నాఁడు సరసములాడఁగనేల
వొంటి నే మాటాడినా వూఁకొననివాఁడవైతే
అంటుముట్టుచెమటల నలయఁగనేలా
(॥చాలు॥)
కాలుదొక్కి యింతలోనే కళదాఁకే వాఁడవైతే
బాలకితో నలి గింత పాయఁగనేల
మేలిమి శ్రీవేంకటేశ మెచ్చితి నీగుణము
వేళతోఁగూడితి వింత వేగిరించనేల
(||pallavi||)
sālum̐jālu dīmasamu sadimāḍa vinavayya
melugalavām̐ḍavu gāmiḍisem̐talelā
(||sālu ||)
avvalimomainabarā kaṁta galavām̐ḍavaide
javvanim̐ gāṁtalase visāriṁchanela
navvagabilisinānu nālisesevām̐ḍavaide
puvvulavalĕ nīmenu pulagiṁchanelā
(||sālu||)
yiṁṭilonanuṁḍi bīrā liṁta galavām̐ḍavaide
aṁṭi nām̐ḍu sarasamulāḍam̐ganela
vŏṁṭi ne māḍāḍinā vūm̐kŏnanivām̐ḍavaide
aṁṭumuṭṭusĕmaḍala nalayam̐ganelā
(||sālu||)
kāludŏkki yiṁtalone kaḽadām̐ke vām̐ḍavaide
bālagido nali giṁta pāyam̐ganela
melimi śhrīveṁkaḍeśha mĕchchidi nīguṇamu
veḽadom̐gūḍidi viṁta vegiriṁchanela