చాలదా యీ జనమము చల్లఁగా మీరిట్లుంటే
(॥పల్లవి॥)
చాలదా యీ జనమము చల్లఁగా మీరిట్లుంటే
పాలుగల ఆకె యెంతభాగ్యము సేసినదో
(॥చాల॥)
సతి సేనకొప్పుతోడ చంద్రవంక బొట్టుతోడ
ఇసుమంతనవ్వు చిందె నేఁటికో కాని
అసురుసురయ్యీని అప్పటినుండి నామేను
యెనగ నీకు నాకె యేమౌను చెప్పరా
(॥చాల॥)
పచ్చఁబట్టు పయ్యదతో భారపు గుబ్బలతోడ
ఇచ్చట నీవంక చూచె నేఁటికోకాని
వెచ్చనైతి నిది చూచి వేసాలు మాని నాతో
వచ్చేనని యాసపెట్టి వచ్చితివో చెప్పగా
(॥చాల॥)
ముత్తేలకమ్మలతోడ ముంజేతిసొమ్ములు చూపి
యెత్తి నీకు సన్నసేసి నేఁటికో కాని
చిత్తగించి కూడితివి శ్రీ వేంకటేశుఁడ నన్ను
హత్తి మా యిద్దరిలోని నౌఁగాము లెంచరా
(||pallavi||)
sāladā yī janamamu sallam̐gā mīriṭluṁṭe
pālugala āgĕ yĕṁtabhāgyamu sesinado
(||sāla||)
sadi senagŏppudoḍa saṁdravaṁka bŏṭṭudoḍa
isumaṁtanavvu siṁdĕ nem̐ṭigo kāni
asurusurayyīni appaḍinuṁḍi nāmenu
yĕnaga nīgu nāgĕ yemaunu sĕpparā
(||sāla||)
pachcham̐baṭṭu payyadado bhārabu gubbaladoḍa
ichchaḍa nīvaṁka sūsĕ nem̐ṭigogāni
vĕchchanaidi nidi sūsi vesālu māni nādo
vachchenani yāsabĕṭṭi vachchidivo sĕppagā
(||sāla||)
muttelagammaladoḍa muṁjedisŏmmulu sūbi
yĕtti nīgu sannasesi nem̐ṭigo kāni
sittagiṁchi kūḍidivi śhrī veṁkaḍeśhum̐ḍa nannu
hatti mā yiddariloni naum̐gāmu lĕṁcharā