Saaladaa naageebhaagyamu sadamaayanu

చాలదా నాకీభాగ్యము సతమాయను
Language

(॥పల్లవి॥)
చాలదా నాకీభాగ్యము సతమాయను
కాలు దొక్కినప్పుడే కానిమ్మంటిఁ గదవే

(॥చాల॥)
మాఁటలు సారె నాడితే మందెమేళమయ్యీని
యేఁటికే గుట్టున నుండే దిదిమేలే
చీకటి మాటికినేల చేరి యానలువెట్టీనే
చాటించి తొల్లె తనకు సతినైతిఁగదవే

(॥చాల॥)
చూపులు చూడఁజూడఁగ చులుకఁదనములౌను
యేపున మాటున నుండు టిది మేలే
తోపునూకుడు సేసుక తొంగి యేల చూచీనే
వోపి తొల్లె సేసవెట్టి వుందానఁగదవే

(॥చాల॥)
నవ్వులు సారె నవ్వఁగ ననుపు మొగచాటయ్యీ
యవ్వలఁ గాంగిట నించె నిది మేలే
రవ్వలేల సేసీనేరతి శ్రీవేంకటేశుఁడు
వువ్విళ్లూర దేవులనై వొప్పుగొంటిఁగదవే

(||pallavi||)
sāladā nāgībhāgyamu sadamāyanu
kālu dŏkkinappuḍe kānimmaṁṭim̐ gadave

(||sāla||)
mām̐ṭalu sārĕ nāḍide maṁdĕmeḽamayyīni
yem̐ṭige guṭṭuna nuṁḍe didimele
sīgaḍi māḍiginela seri yānaluvĕṭṭīne
sāḍiṁchi tŏllĕ tanagu sadinaidim̐gadave

(||sāla||)
sūbulu sūḍam̐jūḍam̐ga sulugam̐danamulaunu
yebuna māḍuna nuṁḍu ṭidi mele
tobunūguḍu sesuga tŏṁgi yela sūsīne
vobi tŏllĕ sesavĕṭṭi vuṁdānam̐gadave

(||sāla||)
navvulu sārĕ navvam̐ga nanubu mŏgasāḍayyī
yavvalam̐ gāṁgiḍa niṁchĕ nidi mele
ravvalela sesīneradi śhrīveṁkaḍeśhum̐ḍu
vuvviḽlūra devulanai vŏppugŏṁṭim̐gadave