చాలదా దంపతులకు జన్మసాఫల్య మిది
(॥పల్లవి॥)
చాలదా దంపతులకు జన్మసాఫల్య మిది
యీ లాగు నీనేరుపులే యెందూఁ దలతురా
(॥చాల॥)
పరపుపైఁ బవళించి పచ్చిగానే నిన్నుఁ గూడి
సరుస మోములు చూచి సారెకు నవ్వి
సరుగఁ గెమ్మోవితీపు చవిచూచిచూచి అందు
గురుతులు సేసిన ఇక్కువలే తలఁతురా
(॥చాల॥)
పొంచి తూఁగుమంచముపై పొలఁతి తమలపాకు
చుంచుల నందుకొనుచుఁ జోక్కిచొక్కి
అంచెఁ బచ్చిమాటలాడి అంతలోనే కళలంటి
కొంచక చొక్కించినదె కోరి తలఁతురా
(॥చాల॥)
సింగారపుదోఁటలొన శ్రీవేంకటేశ నీవు
చెంగటనే నన్నుఁ గూడి చెక్కునొక్కి
పొంగేటిరతులలోన బుసకొట్టిబుసకొట్టి
అంగములే చెమరించే ఆస లీడఁ దలఁతురా
(||pallavi||)
sāladā daṁpadulagu janmasāphalya midi
yī lāgu nīnerubule yĕṁdūm̐ daladurā
(||sāla||)
parabubaim̐ bavaḽiṁchi pachchigāne ninnum̐ gūḍi
sarusa momulu sūsi sārĕgu navvi
sarugam̐ gĕmmovidību savisūsisūsi aṁdu
gurudulu sesina ikkuvale talam̐turā
(||sāla||)
pŏṁchi tūm̐gumaṁchamubai pŏlam̐ti tamalabāgu
suṁchula naṁdugŏnusum̐ jokkisŏkki
aṁchĕm̐ bachchimāḍalāḍi aṁtalone kaḽalaṁṭi
kŏṁchaga sŏkkiṁchinadĕ kori talam̐turā
(||sāla||)
siṁgārabudom̐ṭalŏna śhrīveṁkaḍeśha nīvu
sĕṁgaḍane nannum̐ gūḍi sĕkkunŏkki
pŏṁgeḍiradulalona busagŏṭṭibusagŏṭṭi
aṁgamule sĕmariṁche āsa līḍam̐ dalam̐turā