Saagara sangamame pranaya saagara sangamame

సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే
Year
Language

పల్లవి:

సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే
సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే
కలలే అలలై ఎగసిన కడలికి
కలలే అలలై ఎగసిన కడలికి
కలలో ఇలలో...
కలలో ఇలలో దొరకని కలయిక

చరణం 1:

కన్యాకుమారి నీ పదములు నేనే ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కన్యాకుమారి నీ పదములు నేనే
కడలి కెరటమై కడిగిన వేళా
సుమ కుసుమారి నీ చూపులకే
తడబడి వరములు అడిగిన వేళా

అలిగిన నా పలు అలకలు నీలో
పులకలు రేపి పువ్వులు విసిరిన
పున్నమి రాతిరి నవ్విన వేళా..

సాగర సంగమమే.... ప్రణయ సాగర సంగమమే

చరణం 2:

భారత భారతి పద సన్నిధిలో
కులమత సాగర సంగమ శృతిలో
నా రతి నీవని వలపుల హారతి
హృదయము ప్రమిదగా వెలిగిన వేళా

పరువపు ఉరవడి పరువిడి నీ ఒడి
కన్నుల నీరిడి కలిసిన మనసున
సందెలు కుంకుమ చిందిన వేళా

సాగర సంగమమే ప్ర ణ య సాగర సంగమమే
సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే

pallavi:

sāgara saṁgamame praṇaya sāgara saṁgamame
sāgara saṁgamame praṇaya sāgara saṁgamame
kalale alalai ĕgasina kaḍaligi
kalale alalai ĕgasina kaḍaligi
kalalo ilalo...
kalalo ilalo dŏragani kalayiga

saraṇaṁ 1:

kanyāgumāri nī padamulu nene ā ā ā ā ā ā ā ā
kanyāgumāri nī padamulu nene
kaḍali kĕraḍamai kaḍigina veḽā
suma kusumāri nī sūbulage
taḍabaḍi varamulu aḍigina veḽā

aligina nā palu alagalu nīlo
pulagalu rebi puvvulu visirina
punnami rādiri navvina veḽā..

sāgara saṁgamame.... praṇaya sāgara saṁgamame

saraṇaṁ 2:

bhārada bhāradi pada sannidhilo
kulamada sāgara saṁgama śhṛtilo
nā radi nīvani valabula hāradi
hṛdayamu pramidagā vĕligina veḽā

paruvabu uravaḍi paruviḍi nī ŏḍi
kannula nīriḍi kalisina manasuna
saṁdĕlu kuṁkuma siṁdina veḽā

sāgara saṁgamame pra ṇa ya sāgara saṁgamame
sāgara saṁgamame praṇaya sāgara saṁgamame